విశాఖ ఎయిర్ పోర్టులో 'సింహాద్రి అప్పన్న'... తొలి దర్శనం చేసుకున్న కేజీఎఫ్ స్టార్ యశ్
- ఎయిర్ పోర్టులో మందిరం ఏర్పాటు
- తొలిపూజ చేసిన స్వామి స్వరూపానందేంద్ర
- అదే సమయంలో ఎయిర్ పోర్టుకు వచ్చిన యశ్
- మందిరంలో ప్రత్యేక పూజలు
ఎంతో ప్రసిద్ధి చెందిన సింహాద్రి అప్పన్న ఇప్పుడు విశాఖపట్నం ఎయిర్ పోర్టులోనూ దర్శనమివ్వనున్నాడు. నగరానికి వచ్చే భక్తులు స్వామివారిని దర్శించుకోవడం కోసం ఎయిర్ పోర్టులోనే మందిరం ఏర్పాటు చేశారు. చందన రూపధారి అయిన సింహాద్రి అప్పన్నకు తొలిపూజను విశాఖ శారదా పీఠాధిపతి స్వామి స్వరూపానందేంద్ర సరస్వతి శాస్త్రోక్తంగా నిర్వహించారు.
విగ్రహం ఏర్పాటు చేసిన కాసేపటికే కేజీఎఫ్ హీరో యశ్ దర్శించుకున్నారు. అధికారులు, అర్చకులు ఆయనకు స్వాగతం పలికారు. అర్చకస్వామి సీతారామాచార్యులు ప్రత్యేక పూజలు చేశారు. సింహాచల క్షేత్ర ఈవో చంద్రకళ హీరో యశ్ కు స్వామివారి తీర్థప్రసాదాలు, శేషవస్త్రాలు అందజేశారు.
కాగా, భక్తులు స్వామివారి దివ్య చరిత్రను ఆడియో రూపంలో తెలుసుకునేందుకు ఇక్కడ క్యూఆర్ కోడ్ సిస్టమ్ ను అందుబాటులోకి తీసుకురానున్నారు. అంతేకాదు, డొనేషన్ల కోసం ప్రత్యేక వెబ్ సైట్ కు రూపకల్పన చేశారు.
దీనికి సంబంధించిన వివరాలను సింహాచల క్షేత్ర ఈవో చంద్రకళ తెలిపారు. ఇప్పటికే విశాఖపట్నం రైల్వే స్టేషన్ లో సింహాద్రి అప్పన్న మందిరం ఏర్పాటు చేశామని, మరికొన్నిరోజుల్లో ఒడిశాలోని భువనేశ్వర్ రైల్వేస్టేషన్ లో కూడా ఇదే తరహాలో స్వామివారి విగ్రహం ఏర్పాటు చేయనున్నట్టు తెలిపారు.