థాయ్‌ల్యాండ్‌తో తెలంగాణ కీల‌క ఒప్పందం.. స్టార్ట‌ప్‌ల ఏర్పాటుపై ప్ర‌ధాన దృష్టి

  • ఎంఎస్ఎంఈ, స్టార్ట‌ప్‌ల ఏర్పాటుపై దృష్టి
  • అగ్రి, అగ్రి బేస్డ్‌, ఫుడ్‌, ఉడ్ ప్రాసెసింగ్ యూనిట్లపై అధ్య‌య‌నం
  • పెట్టుబ‌డుల‌కు గ‌ల అవ‌కాశాల‌పై అధ్య‌య‌నం
పెట్టుబ‌డుల ఆకర్ష‌ణ‌లో దూసుకెళుతున్న తెలంగాణ స‌ర్కారు సోమ‌వారం నాడు మ‌రో కీల‌క ఒప్పందంపై సంత‌కాలు చేసింది. తెలంగాణ ప‌రిశ్ర‌మ‌ల శాఖ ముఖ్య కార్య‌ద‌ర్శి జ‌యేశ్ రంజ‌న్ స్వ‌యంగా పాలుపంచుకున్న ఈ ఒప్పందంలో తెలంగాణ ప‌రిశ్ర‌మ‌ల శాఖ మంత్రి కేటీఆర్‌, థాయ్‌ల్యాండ్ ఉప ప్ర‌ధాని ల‌క్స‌న‌విసిత్‌లు వ‌ర్చువ‌ల్ విధానంలో పాలుపంచుకున్నారు. ఈ మేర‌కు ఇరు వైపుల నుంచి అధికారులు ఒప్పంద ప‌త్రాల‌పై సంత‌కాలు చేశారు.

ఈ ఒప్పందం ప్ర‌కారం ఇరు వైపుల పెట్టుబ‌డుల‌కు గ‌ల అవ‌కాశాల‌పై అధ్య‌య‌నం జ‌ర‌గ‌నుంది. వ్య‌వ‌సాయ‌,   వ్య‌వ‌సాయ అనుబంధ రంగాలు, ఫుడ్ ప్రాసెసింగ్, క‌ల‌ప ఆధారిత ప‌రిశ్ర‌మ‌ల ఏర్పాటుకు సంబంధించిన రంగాల్లో పెట్టుబ‌డులకు గ‌ల అవ‌కాశాల‌పై అధ్య‌య‌నం జ‌ర‌గ‌నుంది. అంతేకాకుండా ఈ రంగాల్లో ఇటు తెలంగాణ‌తో పాటు అటు థాయ్‌ల్యాండ్‌లోనూ పెట్టుబ‌డుల‌కు గ‌ల అవ‌కాశాల‌పై ఇరు వ‌ర్గాలు ప్ర‌త్యేకంగా దృష్టి సారించ‌నున్నాయి. ఎంఎస్ఎంఈ, స్టార్ట‌ప్‌ల ఏర్పాటే ప్ర‌ధాన ల‌క్ష్యంగా అధ్య‌య‌నం జ‌ర‌గ‌నుంది.


More Telugu News