జగన్ వెనుక మేమంతా సైనికులుగా పనిచేస్తాం.. వైసీపీ అలకలపై కొడాలి నాని కీలక వ్యాఖ్యలు
- జగన్ గ్యారేజీలో తామంతా పనిచేస్తున్నామన్న కొడాలి నాని
- బడుగులకు ప్రాధాన్యమిచ్చింది ఇద్దరే నేతలన్న నాని
- వారిలో ఒకరు ఎన్టీఆర్ అయితే, మరొకరు జగనేనని వెల్లడి
ఏపీలో మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ తర్వాత పదవులు దక్కని పలువురు వైసీపీ ఎమ్మెల్యేలు అలకబూనిన సంగతి తెలిసిందే. ఇలా అలిగిన నేతలను బుజ్జగించే యత్నాలు ఓ మోస్తరుగా ఫలించినా.. ఇంకా కొందరు నేతలు అసంతృప్తితోనే ఉన్నారు. ఈ నేపథ్యంలో జగన్ తొలి కేబినెట్‌లో కీలక మంత్రిగా సాగి... తాజాగా మాజీ మంత్రిగా మారిన కొడాలి శ్రీవెంకటేశ్వరరావు (కొడాలి నాని) కీలక వ్యాఖ్యలు చేశారు. అసంతృప్త నేతలను ఉద్దేశిస్తూ ఆయన చేసిన వ్యాఖ్యలు పార్టీ శ్రేణుల్లో వైరల్‌గా మారాయి.
జగన్ గ్యారేజీలో పనిచేస్తున్న తామంతా ఆయన వెనుక సైనికులుగా పనిచేస్తామన్నారు. రాష్ట్రంలో బడుగు, బలహీన వర్గాలకు పెద్ద పీట వేసిన వారిలో ఒకరు టీడీపీ వ్యవస్థాపకుడు ఎన్టీఆర్ అయితే... రెండో వ్యక్తి జగనేనని ఆయన చెప్పుకొచ్చారు. పార్టీలో ఎలాంటి పదవులు ఇచ్చినా, ఇవ్వకపోయినా పార్టీ కోసం సైనికుల్లా పనిచేయాల్సిన అవసరం తమపై ఉందని ఆయన చెప్పారు. జగన్ ఏ నిర్ణయం తీసుకున్నా..అది పార్టీ శ్రేణులను ఉద్దేశించి తీసుకున్న మంచి నిర్ణయంగానే భావించాలని కూడా ఆయన పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు.