పోలీసు క‌స్ట‌డీకి పుడింగ్ ప‌బ్ కేసు నిందితులు

  • నిందితుల‌ను 4 రోజుల క‌స్ట‌డీకి అనుమ‌తించిన కోర్టు
  • చంచ‌ల్ గూడ్ జైలులో ఉన్న అనిల్, అభిషేక్‌
  • రేప‌టి నుంచి  ప్రారంభం కానున్న పోలీసు క‌స్ట‌డీ
హైద‌రాబాద్‌లో పెను క‌ల‌క‌లం రేపిన పుడింగ్ అండ్ మింక్ ప‌బ్ కేసులో సోమ‌వారం కీల‌క ప‌రిణామం చోటుచేసుకుంది. ప‌బ్‌లో రాత్రి పొద్దుపోయిన త‌ర్వాత కూడా వినియోగ‌దారుల‌ను అనుమ‌తించిన ప‌బ్ యాజ‌మాన్యం పార్టీకి వ‌చ్చిన వారికి డ్ర‌గ్స్ స‌ర‌ఫ‌రా చేసింద‌ని పోలీసులు నిగ్గు తేల్చిన సంగ‌తి తెలిసిందే. ఈ మేర‌కు ప‌బ్‌పై కేసు న‌మోదు చేసిన పోలీసులు అనిల్‌, అభిషేక్ అనే ఇద్ద‌రు వ్య‌క్తుల‌ను అరెస్ట్ చేసిన విష‌య‌మూ విదితమే. 

ఈ కేసులో మ‌రిన్ని వివ‌రాలు రాబ‌ట్టాల్సి ఉంద‌ని చెప్పిన పోలీసులు.. నిందితుల‌ను క‌స్ట‌డీకి అప్ప‌గించాల‌ని కోర్టులో గ‌త‌వార‌మే పిటిష‌న్ దాఖ‌లు చేశారు. ఈ పిటిష‌న్‌పై సోమ‌వారం నాడు విచార‌ణ జ‌రిపిన కోర్టు... నిందితులిద్ద‌రినీ పోలీసు క‌స్ట‌డీకి అప్ప‌గిస్తూ నిర్ణ‌యం తీసుకుంది. కోర్టు ఆదేశాల‌తో నిందితులిద్ద‌రినీ రేప‌టి నుంచి 4 రోజుల పాటు త‌మ క‌స్ట‌డీకి తీసుకోనున్న పోలీసులు వారి నుంచి మ‌రిన్ని వివ‌రాలు రాబ‌ట్ట‌నున్నారు. ప్ర‌స్తుతం చంచ‌ల్‌గూడ జైలులో ఉన్న వీరిద్ద‌రూ రేప‌టి నుంచి పోలీస్ క‌స్ట‌డీలోకి వెళ్ల‌నున్నారు.


More Telugu News