బీసీలకు సీఎం పదవి ఇచ్చి జగన్ డిప్యూటీ సీఎంగా ఉండొచ్చు కదా?: సోము వీర్రాజు

  • ఏపీలో కొలువుదీరిన కొత్త మంత్రివర్గం
  • బడుగులకు పెద్దపీట వేశామంటున్న వైసీపీ పెద్దలు
  • విమర్శలు గుప్పించిన సోము వీర్రాజు
ఏపీలో నూతన మంత్రివర్గాన్ని ఏర్పాటు చేయడం తెలిసిందే. బీసీలు, బడుగు బలహీన వర్గాలకు పెద్దపీట వేశామని వైసీపీ ప్రభుత్వ పెద్దలు చెప్పుకుంటుండడంపై ఏపీ బీజేపీ చీఫ్ సోము వీర్రాజు స్పందించారు. నామమాత్రపు అధికారాలతో పదవులు ఇచ్చినంత మాత్రాన బీసీల అభ్యున్నతి అనిపించుకోదని చురక అంటించారు. బీసీలపై అంత ప్రేమే ఉంటే బీసీలకు సీఎం పదవి ఇచ్చి జగన్ డిప్యూటీ సీఎంగా ఉండొచ్చు కదా! అని వ్యాఖ్యానించారు. 

కుటుంబ పార్టీల వల్ల మంత్రులకు పవర్ ఉండదని, జగన్ క్యాబినెట్ లో ఉన్న మంత్రులకు పవర్ ఉందా? అని ప్రశ్నించారు. పాత హోంమంత్రి మేకతోటి సుచరిత కనీసం ఒక్క డీఎస్పీనైనా బదిలీ చేయగలిగారా? కొత్త హోంమంత్రి తానేటి వనిత ఓ కానిస్టేబుల్ నైనా బదిలీ చేయగలరా? అంటూ సోము వీర్రాజు వ్యంగ్యం ప్రదర్శించారు.


More Telugu News