శ్రీరామనవమి సందర్భంగా చోటుచేసుకున్న హింసపై రాహుల్ గాంధీ స్పందన
- నిన్న శ్రీరామనవమి నాడు నాలుగు రాష్ట్రాల్లో ఘర్షణలు
- గుజరాత్ లో ఒకరు మరణించినట్టు సమాచారం
- విద్వేషం, హింస విడనాడాలన్న రాహుల్
శ్రీరామనవమి పర్వదినం సందర్భంగా మధ్యప్రదేశ్, పశ్చిమ బెంగాల్, గుజరాత్, ఝార్ఖండ్ రాష్ట్రాల్లో హింసాత్మక ఘటనలు చోటుచేసుకున్నాయి. శ్రీరామ శోభాయాత్రల్లో ఉద్రిక్తతలు చోటుచేసుకున్నాయి. గుజరాత్ లో ఓ వ్యక్తి మరణించినట్టు ప్రచారం జరుగుతోంది. ఢిల్లీలోని జేఎన్ యూలో సైతం విద్యార్థుల మధ్య ఘర్షణలు జరిగాయి. పలువురు విద్యార్థులు ఆసుపత్రి పాలయ్యారు.
ఈ ఘటనలపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ స్పందించారు. శాంతి, సామరస్యం, సౌభ్రాతృత్వంతో కూడిన పునాదులే దేశ పురోగతికి మార్గం వేస్తాయే తప్ప... విద్వేషం, హింసతో ఏమీ సాధించలేరని, పైగా ఆ రెండు అంశాలు దేశాన్ని బలహీనపరుస్తున్నాయని అభిప్రాయపడ్డారు. భిన్నరకాల సంస్కృతులకు నెలవైన సమ్మిళిత భారతదేశాన్ని కాపాడుకునేందుకు ఐక్యంగా నిలబడాలని పిలుపునిచ్చారు.