కేసీఆర్ ఢిల్లీ దీక్షపై బండి సంజయ్ ఘాటు వ్యాఖ్య
- కొనుగోలు కేంద్రాలు తెరవాలంటూ బీజేపీ నిరసన
- ఇందిరా పార్క్ వద్ద జరిగిన నిరసనలో పాల్గొన్న బండి సంజయ్
- పాలనా వైఫల్యాల నుంచి ప్రజల దృష్టి మరల్చేందుకే దీక్షలని ఆరోపణ
తెలంగాణలో యాసంగి ధాన్యం మొత్తాన్ని కేంద్రమే కొనుగోలు చేయాలంటూ టీఆర్ఎస్ చేస్తున్న నిరసనల్లో భాగంగా ఢిల్లీలోని ఆ పార్టీ కార్యాలయంలో చేపట్టిన దీక్షలో స్వయంగా సీఎం కేసీఆర్ కూర్చున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో సీఎం కేసీఆర్ ఢిల్లీలో చేసిన దీక్షపై బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. సీఎం కేసీఆర్ దొంగ దీక్షలను తెలంగాణ ప్రజలు నమ్మే స్థితిలో లేరంటూ బండి సంజయ్ వ్యాఖ్యానించారు.
యాసంగి ధాన్యాన్ని రాష్ట్రంలోనే కొనుగోలు చేసేలా రాష్ట్రంలో కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలన్న డిమాండ్‌తో హైదరాబాద్‌లోని ఇందిరా పార్క్ వద్ద బీజేపీ చేపట్టిన నిరసనలో పాలుపంచుకున్న సందర్భంగా కేసీఆర్ దీక్షపై బండి సంజయ్ విరుచుకుపడ్డారు.
సీఎం కేసీఆర్ రాష్ట్రంలో ఏమీ చేయలేకే ఢిల్లీకి వెళ్లి దీక్ష చేశారని ఈ సందర్భంగా బండి సంజయ్ అన్నారు. తన పాలనలోని వైఫల్యాల నుంచి ప్రజల దృష్టిని మరల్చేందుకే కేసీఆర్ ఢిల్లీలో దీక్ష చేపట్టారని కూడా ఆయన వ్యాఖ్యానించారు. ధాన్యం కొనుగోళ్లకు సంబంధించి దేశంలో ఏ ఒక్క రాష్ట్రంలో లేని సమస్యను తెలంగాణలో కేసీఆర్ ఎందుకు సృష్టించారని కూడా బండి సంజయ్ ప్రశ్నించారు.