ముగిసిన కేసీఆర్ 10 రోజుల ఢిల్లీ టూర్.. రేపు కేబినెట్ భేటీ
- సోమవారమే హైదరాబాద్‌కు కేసీఆర్
- ఢిల్లీలో దీక్షతో హస్తిన టూర్‌ను ముగించిన సీఎం
- మంగళవారం ప్రగతి భవన్‌లో కేబినెట్ భేటీ
- యాసంగి ధాన్యం కొనుగోళ్లపై కీలక చర్చ
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తన ఢిల్లీ పర్యటనను నేటితో ముగించనున్నారు. పది రోజుల క్రితం ఢిల్లీ టూర్ వెళ్లిన కేసీఆర్.. పది రోజుల పాటు దేశ రాజధానిలోనే గడిపారు. సోమవారం ఢిల్లీలోని తన కార్యాలయంలో టీఆర్ఎస్ పార్టీ నిర్వహించిన ధర్నాలో పాలుపంచుకున్న కేసీఆర్.. తన ఢిల్లీ టూర్‌ను ముగించుకున్నారు. ఈ రోజే ఆయన ఢిల్లీ నుంచి బయలుదేరి హైదరాబాద్ రానున్నారు.
ఇక మంగళవారం నాడు తన మంత్రివర్గంతో ముఖ్యమంత్రి సమావేశం కానున్నారు. ప్రగతి భవన్‌లో జరగనున్న ఈ కేబినెట్ భేటీలో యాసంగి ధాన్యం కొనుగోళ్లపై కీలక చర్చ జరగనున్నట్లుగా సమాచారం. ధాన్యం కొనుగోళ్లపై కేంద్రం స్పందించినా... స్పందించకపోయినా రైతులకు ఎలాంటి నష్టం జరగకుండా ఉండేలా తీసుకోవాల్సిన చర్యలపై కేబినెట్‌లో కీలక చర్చ జరగనుంది.