అలియాభట్, రణబీర్ వివాహం.. అతిథులు 28 మందే
- కుటుంబ సభ్యులకే ఆహ్వానం
- అలియాభట్ సోదరుడు రాహుల్ భట్ ప్రకటన
- చెంబూర్ లోని రణబీర్ నివాసంలో వ్ పెళ్లి?
అలియాభట్, రణబీర్ వివాహం కేవలం అతి కొద్ది మంది సన్నిహితుల సమక్షంలోనే జరగనుంది. పెళ్లికి 28 మంది అతిథులు హాజరు కానున్నట్టు అలియాభట్ సోదరుడు రాహుల్ భట్ తెలిపారు. వీరంతా కూడా అధిక శాతం కుటుంబ సభ్యులేనని, బస్సులో చెంబూర్ కు వస్తారని చెప్పారు. మహేష్ భట్ రెండో భార్య సోని రజ్దాన్ కుమార్తే అలియా భట్. మహేష్ భట్ మొదటి భార్య కిరణ్ భట్ కు కలిగిన సంతానం రాహుల్ భట్.
ముంబై, చెంబూర్ లో రణబీర్ కపూర్ నివాసంలో వివాహం జరగనున్నట్టు రాహుల్ ప్రకటన పరిశీలిస్తే తెలుస్తోంది. పలువురు బాలీవుడ్ ప్రముఖులు వస్తారంటూ గతంలో వార్తలు వచ్చాయి. రాహుల్ భట్ ప్రకటన ప్రకారం బయటి వారు ఎవరికీ ఆహ్వానం ఉండదని తెలుస్తోంది. వివాహ వేదిక విషయంలో రణబీర్ కపూర్ కు చెందిన బంద్రాలోని నివాసం పేరు కూడా వినిపిస్తోంది. ఇంకా అలియాభట్, రణబీర్ కపూర్ వైపు నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.