రేపు ప్ర‌గ‌తి భ‌వ‌న్‌లో సీఎం కేసీఆర్ నేతృత్వంలో కేబినెట్ భేటీ

  • కేంద్ర ప్ర‌భుత్వానికి 24 గంట‌ల డెడ్‌లైన్ విధించిన కేసీఆర్
  • ఆయా అంశాల‌తో పాటు రాష్ట్రానికి సంబంధించిన అంశాల‌పై చ‌ర్చ‌
  • ధాన్యం కొనుగోళ్ల‌పై కీల‌క నిర్ణ‌యాలు తీసుకోనున్న కేబినెట్‌
కేంద్ర స‌ర్కారుపై పోరాటానికి తెలంగాణ ప్ర‌జలు, అన్న‌దాతలు సిద్ధంగా ఉన్నార‌ని సీఎం కేసీఆర్ ప్ర‌క‌టించిన విష‌యం తెలిసిందే. అలాగే, కేంద్ర ప్ర‌భుత్వం 24 గంట‌ల్లోపు ధాన్యం సేక‌ర‌ణ‌పై ఓ నిర్ణ‌యం తీసుకోవాల‌ని కేసీఆర్‌ డిమాండ్ చేశారు. 

ఆయా అంశాల‌తో పాటు రాష్ట్రానికి సంబంధించిన ప‌లు అంశాల‌పై చ‌ర్చించేందుకు రేపు మ‌ధ్యాహ్నం హైద‌రాబాద్‌లో కేసీఆర్ నేతృత్వంలో తెలంగాణ కేబినెట్ స‌మావేశం కానుంది. ధాన్యం కొనుగోళ్ల‌పై ఈ భేటీలో నిర్ణ‌యం తీసుకోనున్నారు. రైతుల నుంచి ధాన్యాన్ని కొనుగోలు చేసి మిల్ల‌ర్ల‌కు విక్ర‌యించే అంశం, ధాన్యం నిల్వ‌లు అంశాల‌పై చ‌ర్చించ‌నున్న‌ట్లు తెలుస్తోంది.


More Telugu News