ఫోన్లు పాతవైపోయినా వాడుతున్నారా? రేడియేషన్ రిస్క్ ఉంది జాగ్రత్త!

  • సాధారణ శార్ వ్యాల్యూ 1.6డబ్ల్యూ/కేజీ
  • మోటరోలా ఎడ్జ్ లో పరిమితి కంటే అధిక రేడియేషన్
  • వన్ ప్లస్ 6 మోడల్ లోనూ గరిష్ఠ స్థాయిలో గుర్తింపు
మొబైల్ ఫోన్ల నుంచి రేడియో ధార్మికత (రేడియేషన్) వెలువడుతుందన్నది తెలిసిన విషయమే. కానీ, దీనికంటూ పరిమితులు ఉన్నాయి. యూఎస్ ఫెడరల్ కమ్యూనికేషన్స్ కమిషన్ (ఎఫ్ సీసీ) నిబంధనల ప్రకారం.. ఒక కేజీ మానవ కణజాలానికి 1.6డబ్ల్యూ(వాట్), దీనికంటే తక్కువ రేషియోషన్ ఉంటే అది సురక్షితం. అంతకుమించితే దుష్ప్రభావాలు కనిపిస్తాయి. భారత్ లోనూ ఇదే పరిమితి అమల్లో ఉంది. దీన్ని శార్ వ్యాల్యూగా పేర్కొంటారు. శార్ అంటే స్పెసిఫిక్ అబ్జార్ప్ షన్ రేట్. ఈ పరిమితి వరకే మన కేజీ శరీర కణజాలం రేడియేషన్ ను గ్రహించగలదు. 

కానీ కొన్ని పాత స్మార్ట్ ఫోన్ మోడళ్లు అధిక రేడియేషన్ ను విడుదల చేస్తున్నట్టు బ్యాంక్ లెస్ టైమ్స్ అనే సంస్థ రిపోర్ట్ చేసింది. మోటరోలా ఎడ్జ్ సార్ వ్యాల్యూ 1.79డబ్ల్యూ/కేజీగా ఉంది. ఇక రెండో స్థానంలో జెడ్ టీఈ యాక్సన్ 1 5జీ మోడల్ ఉంది. భారత మార్కెట్లో ఈ ఫోన్ అందుబాటులో లేదు. దీని శార్ వ్యాల్యూ 1.59 డబ్ల్యూ/కేజీగా ఉంది. అంటే గరిష్ఠ పరిమితి వద్ద ఉంది. వన్ ప్లస్ 6టీ మోడల్ శార్ వ్యాల్యూ సైతం 1.55డబ్ల్యూ/కేజీగా పరీక్షల్లో వెల్లడైంది. ఫోన్లు మరీ పాతవైన తర్వాత కూడా వాడడం వల్ల అధిక రేడియేషన్ రిస్క్ ఉంటుందని దీన్ని బట్టి తెలుస్తోంది.


More Telugu News