ఏపీ మంత్రుల ప్రమాణస్వీకారాలు ప్రారంభం.. తొలి ప్రమాణం ఎవరు చేశారంటే..?

  • మంత్రులతో ప్రమాణం చేయిస్తున్న గవర్నర్
  • తొలుత ప్రమాణం చేసిన అంబటి రాంబాబు
  • కార్యక్రమం ముగిసిన తర్వాత తేనీటి విందు
ఏపీ కొత్త మంత్రుల ప్రమాణస్వీకార కార్యక్రమం ప్రారంభమయింది. ముఖ్యమంత్రి జగన్ సమక్షంలో కొత్త మంత్రుల చేత గవర్నర్ బిశ్వభూషన్ హరిచందన్ ప్రమాణం చేయిస్తున్నారు. వైసీపీ ప్రభుత్వం ఏర్పడిన 34 నెలల 2 రోజులకు కొత్త మంత్రివర్గం ఏర్పడుతోంది. తాజా కేబినెట్ లో 11 మంది పాత మంత్రులు కాగా... కొత్తగా 14 మందికి అవకాశం దక్కింది. 

తొలుత అంబటి రాంబాబు మంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు. అనంతరం అంజాద్ బాషా, ఆదిమూలపు సురేశ్, బొత్స సత్యనారాయణ, బూడి ముత్యాల నాయుడు, బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి తదితరులు వరుసగా ప్రమాణం చేశారు. ఆంగ్ల అక్షర క్రమంలో ప్రమాణస్వీకార కార్యక్రమం కొనసాగుతోంది. 

ప్రమాణ స్వీకార కార్యక్రమం ముగిసిన వెంటనే గవర్నర్, ముఖ్యమంత్రితో మంత్రులు గ్రూపు ఫొటో దిగుతారు. అనంతరం సచివాలయంలో గవర్నర్, సీఎం, కొత్త మంత్రులు, పాత మంత్రులు, అధికారులకు తేనీటి విందు ఉంటుంది.


More Telugu News