అల్లరోడికి అలా గ్యాప్ వచ్చేసిందన్న మాట!
- హాస్య కథానాయకుడిగా అల్లరి నరేశ్ కి మంచి పేరు
- తాజా చిత్రంగా 'ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం'
- మారేడుమిల్లి నేపథ్యంలో సాగే కథ
- కథానాయికగా ఆనంది
అల్లరి నరేశ్ .. రాజేంద్రప్రసాద్ తరువాత పూర్తిస్థాయి హాస్య కథానాయకుడిగా ఎక్కువ మార్కులు కొట్టేసినవాడిగా కనిపిస్తాడు. మినిమమ్ గ్యారెంటీ హీరోగా ఆయన పేరు చెబుతారు. అలాంటి నరేశ్ కి చాలా కాలం తరువాత 'నాందీ' సినిమాతో మంచి హిట్ పడింది. అంతకుముందు ఆయన చేసిన 'మేడ మీద అబ్బాయి' .. 'బంగారు బుల్లోడు' ఆసక్తిని రేకెత్తించినా ఫలితం నిరాశ పరిచింది.
ఆ తరువాత ఆయన సతీశ్ మల్లంపాటి అనే కొత్త దర్శకుడితో 'సభకు నమస్కారం' సినిమా చేస్తున్నట్టుగా ప్రకటించారు. ఆ సినిమా నుంచి ఒకటి రెండు పోస్టర్లు కూడా బయటికి వచ్చాయి. టైటిల్ బాగా కనెక్ట్ అయింది. అయితే కొన్ని కారణాల వలన ఆ ప్రాజెక్టు మధ్యలోనే ఆగిపోవడంతో గ్యాప్ వచ్చేసింది. ఆయన ఏం చేస్తున్నది తెలియలేదు.
' ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం' అనే సినిమాను ఆయన చేస్తున్నట్టుగా, నిన్న టైటిల్ పోస్టర్ రిలీజ్ చేయడం వలన తెలుస్తోంది. టైటిల్ ను బట్టి .. పోస్టర్ ను బట్టి ఇది అడవి నేపథ్యంలో సాగే కథ అనే విషయం అర్థమవుతోంది. రాజేశ్ దండు - బాలాజీ నిర్మిస్తున్న ఈ సినిమాకి, జీఆర్ మోహన్ దర్శకత్వం వహిస్తున్నాడు. అల్లరి నరేశ్ సరసన నాయికగా ఆనంది కనిపించనుంది.