రాకేశ్ టికాయత్ ఇంతకుముందూ కేసీఆర్తో సమావేశమయ్యారు.. నేడు మద్దతు తెలపడానికి వచ్చారు: కల్వకుంట్ల కవిత
- తెలంగాణ రైతులు పండిస్తోన్న పంటకు తగిన ధర దక్కట్లేదు
- తెలంగాణ ధాన్యాన్ని కొనాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం
- పంటలకు సంబంధించి సాధారణ సేకరణ విధానాన్ని ప్రవేశపెట్టాలన్న కవిత
న్యూఢిల్లీలోని తెలంగాణ భవన్ వద్ద టీఆర్ఎస్ చేపట్టిన దీక్షలో సీఎం కేసీఆర్, తెలంగాణ మంత్రులు సహా ఎంపీలు, ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. ధాన్యం సేకరణలో ఒకే విధానం ఉండాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత జాతీయ మీడియాతో మాట్లాడారు.
''తెలంగాణ రైతులు పండిస్తోన్న పంటకు తగిన ధర దక్కట్లేదు. తెలంగాణ ధాన్యాన్ని కొనాలని మేము కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాము. పంటలకు సంబంధించి సాధారణ సేకరణ విధానాన్ని ప్రవేశపెట్టాలని అడుగుతున్నాము. తెలంగాణ సీఎం కేసీఆర్తో రైతు ఉద్యమ నేత రాకేశ్ టికాయత్ ఇంతకు ముందు కూడా సమావేశమయ్యారు. ఈ రోజు మేము చేస్తోన్న ధర్నాకు మద్దతు తెలపడానికి ఇక్కడకు వచ్చారు' అని కవిత తెలిపారు.