తన మద్దతుదారులతో బాలినేని శ్రీనివాస రెడ్డి కీలక భేటీ
- ప్రకాశం జిల్లాలోని బాలినేని నివాసంలో సమావేశం
- భవిష్యత్తు కార్యాచరణపై చర్చ
- బాలినేనిని కలిసిన ఎమ్మెల్యేలు కొండారెడ్డి, నాగార్జున రెడ్డి
- ఒంగోలు జడ్పీటీసీ చండూచి కోమలేశ్వరి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటన
ఏపీ కొత్త క్యాబినెట్ లో వైసీపీ నేత బాలినేని శ్రీనివాసరెడ్డికి చోటు దక్కని విషయం తెలిసిందే. ప్రకాశం జిల్లా వైసీపీ నాయకులు ఆయన నివాసానికి చేరుకున్నారు. దీంతో ఆయన తన నివాసంలో అనుచరులతో కీలక భేటీ నిర్వహిస్తున్నారు. తన భవిష్యత్తు కార్యాచరణపై ఆయన చర్చిస్తున్నట్లు తెలుస్తోంది. ఆయనను మార్కాపురం ఎమ్మెల్యే కొండారెడ్డి, ఎమ్మెల్యే నాగార్జున రెడ్డి కూడా కలిశారు. బాలినేనితో భవిష్యత్ కార్యాచరణపై చర్చించినట్లు తెలుస్తోంది.
మంత్రి పదవి దక్కకపోవడంతో బాలినేని ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసే అవకాశాలు ఉన్నాయని ప్రచారం జరుగుతోంది. బాలినేనికి మద్దతుగా మేయర్, కార్పొరేటర్లు సమావేశం అయ్యారు. అంతేగాక, ఒంగోలు జడ్పీటీసీ చండూచి కోమలేశ్వరి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు.