పదేళ్ల యూపీ బాలిక.. 200 కిలోమీటర్ల పరుగు ప్రారంభం
- యూపీ బాలిక కాజల్ వినూత్న కార్యక్రమం
- 17న లక్నో చేరిక
- ముఖ్యమంత్రిని కలుసుకోనున్న కాజల్
- అథ్లెట్ అయ్యి దేశానికి పేరు తేవాలన్న ఆకాంక్ష
వయసు పదేళ్లు ఉంటుంది. చదువుతున్నది నాలుగో తరగతి. ఆమె పేరు కాజల్. ప్రయాగ్ రాజ్ నుంచి లక్నో వరకు 200 కిలోమీటర్ల పరుగు కార్యక్రమాన్ని (మారథాన్) ఆదివారం ప్రారంభించింది. ఈ నెల 17న లక్నోలోని ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ నివాసానికి చేరుకోనుంది.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. తాను గతేడాది ఇందిరా మారథాన్ పరుగు పందెంలో పాల్గొన్నట్టు చెప్పింది. అయినా, జిల్లా యంత్రాంగం నుంచి, తన స్కూల్ నుంచి ప్రశంసలు రాలేదని పేర్కొంది.
కాజల్ నాలుగో తరగతి చదువుతోంది. అథ్లెట్ కావాలన్నది ఆమె ఆశయం. అథ్లెట్ గా మారి దేశానికి పేరు తెచ్చే విషయంలో తనకు కావాల్సిన వనరులను ముఖ్యమంత్రి ఆదిత్యనాథ్ సమకూరుస్తారన్న ఆశతో కాజల్ ఉంది.
ఇక ఎండల తీవ్రత ఎక్కువగా ఉండడంతో ప్రతిరోజు ఉదయం 5 గంటల నుంచి 8 గంటల వరకు.. సాయంత్రం 5 గంటల నుంచి 7 గంటల వరకే పరుగులో పాల్గొంటుంది. మిగిలిన సమయంలో విశ్రాంతి తీసుకుంటుంది. కాజల్ తండ్రి రైల్వేలో పాయింట్ మ్యాన్ గా పనిచేస్తున్నాడు. యూపీలోని లలిత్ పూర్ వీరి స్వగ్రామం.