ఏపీ కేబినెట్లో మళ్లీ ఐదుగురు డిప్యూటీ సీఎంలు?

  • కాసేపట్లో కొత్త మంత్రుల ప్రమాణస్వీకారం
  • మంత్రి పదవులు నిలుపుకున్న 11 మంది పాత మంత్రులు
  • నారాయణస్వామి, అంజాద్ బాషాలకు మరోసారి డిప్యూటీ సీఎంలుగా అవకాశం?
కాసేపట్లో ఏపీ కొత్త మంత్రులు ప్రమాణస్వీకారం చేయబోతున్నారు. మొత్తం 25 మంది మంత్రులు ప్రమాణస్వీకారం చేయనున్నారు. కొత్త మంత్రివర్గం పాత, కొత్త కలయికగా ఉండబోతోంది. పాత మంత్రుల్లో 11 మందిని మళ్లీ అదృష్టం వరించింది. మరోవైపు ఈ సారి కూడా జగన్ కేబినెట్లో ఐదుగురు డిప్యూటీ సీఎంలు ఉంటారని తెలుస్తోంది. 

గత కేబినెట్లో ఎస్సీ, మైనార్టీ విభాగంలో ఉప ముఖ్యమంత్రులుగా పని చేసిన నారాయణస్వామి, అంజాద్ బాషాలకు తిరిగి డిప్యూటీ సీఎం పదవుల్లో కొనసాగే అవకాశం ఉన్నట్టు సమాచారం. ఎస్టీ కోటాలో రాజన్నదొరకు ఛాన్స్ వచ్చే అవకాశం ఉంది. బీసీ కోటాలో ధర్మాన ప్రసాదరావు పేరు వినిపిస్తోంది. 

గత కేబినెట్లో కాపు సామాజికవర్గానికి చెందిన ఆళ్ల నాని స్థానంలో అదే సామాజికవర్గానికి చెందిన అంబటి రాంబాబు, గుడివాడ అమర్నాథ్, కొట్టు సత్యనారాయణ, దాడిశెట్టి రాజాలలో ఎవరికి అవకాశం దక్కుతుందోననే ఆసక్తి నెలకొంది. వీరిలో అంబటి, గుడివాడ అమర్నాథ్ లకు ఎక్కువ అవకాశాలు ఉండొచ్చని అంచనా వేస్తున్నారు.


More Telugu News