అమిత్ షా 'హిందీ' వ్యాఖ్యలపై ప్రకాశ్ రాజ్ కౌంటర్

  • ఇంగ్లీషుకు ప్రత్యామ్నాయంగా హిందీ మాట్లాడాలన్న అమిత్ షా
  • తమిళ్ అద్భుతమైన భాష అంటూ రెహమాన్ కౌంటర్
  • మా మాతృభాషను మేం ప్రేమిస్తాంటూ ప్రకాశ్ రాజ్ ఉద్ఘాటన
దేశంలో ఇంగ్లీషుకు ప్రత్యామ్నాయంగా హిందీ మాట్లాడాలని కేంద్ర హోంమంత్రి అమిత్ షా చేసిన వ్యాఖ్యలు విమర్శలకు దారితీశాయి. ఇప్పటికే ప్రముఖ సంగీతదర్శకుడు ఏఆర్ రెహమాన్ స్పందిస్తూ, తమిళభాష అద్భుతమైనది అంటూ పరోక్ష వ్యాఖ్యలు చేశారు.

తాజాగా, నటుడు ప్రకాశ్ రాజ్ కూడా ఈ విషయంపై ఓ ఇంటర్వ్యూలో అసంతృప్తి వ్యక్తం చేశారు. "అమిత్ షా గారూ... మేం హిందీ ఎక్కడ మాట్లాడాలో, హిందీ ఎక్కడ నేర్చుకోవాలని మీరు కోరుకుంటున్నారో తెలుసుకోవాలనుకుంటున్నాం" అని ఆయన వ్యాఖ్యానించారు. 

"మిస్టర్ హోమ్ మినిస్టర్... హోమ్స్ ను బ్రేక్ చేయొద్దు" అంటూ చురక కూడా అంటించారు. "హిందీని బలవంతంగా రుద్దే ప్రయత్నం చేయొద్దు... మా భిన్నత్వాన్ని మేం ప్రేమిస్తాం, మా మాతృభాషను మేం ప్రేమిస్తాం... మా ఆస్తిత్వాలను మేం ప్రేమిస్తాం..." అంటూ స్పష్టం చేశారు.


More Telugu News