జేఎన్ యూలో మాంసాహారం చిచ్చు... శ్రీరామనవమి రోజున కొట్టుకున్న విద్యార్థులు
- నిన్న శ్రీరామనవమి
- ఏబీవీపీ, జేఎన్ఎస్ యూ మధ్య పరస్పర ఆరోపణలు
- క్యాంపస్ లో తీవ్ర ఉద్రిక్తతలు
- పరిస్థితిని అదుపు చేసిన పోలీసులు
ఢిల్లీలోని ప్రఖ్యాత జేఎన్ యూ (జవహర్ లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయం)లో విద్యార్థి సంఘాల మధ్య శ్రీరామనవమి రోజున తీవ్ర ఘర్షణ చోటుచేసుకుంది. నిన్న శ్రీరామనవమి కావడంతో జేఎన్ యూలోని కావేరీ మెస్ లో మాంసాహారం వడ్డించరాదని ఏబీవీపీ కార్యకర్తలు హుకుం జారీ చేశారని జేఎన్ఎస్ యూ కార్యకర్తలు ఆరోపణలు చేశారు.
అయితే, క్యాంపస్ లో శ్రీరామనవమి పూజలకు జేఎన్ఎస్ యూ కార్యకర్తలు అడ్డుతగిలారని ఏబీవీపీ కార్యకర్తలు ప్రత్యారోపణలు చేశారు. దాంతో, ఇరువర్గాల మధ్య పరస్పరం దాడులు జరిగాయి. పెద్ద సంఖ్యలో విద్యార్థులకు గాయాలయ్యాయి. దీనిపై సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే రంగంలోకి దిగి పరిస్థితిని చక్కదిద్దారు.