స్టొయినిస్ రాణించినా... ఓటమిపాలైన లక్నో సూపర్ జెయింట్స్
- ఐపీఎల్ లో మరో ఆసక్తికర పోరు
- లక్నో ముందు 166 పరుగుల విజయలక్ష్యం
- 162 పరుగులే చేసిన లక్నో
- ఆఖరి ఓవర్ అద్భుతంగా వేసిన కుల్దీప్ సేన్
- రాజస్థాన్ రాయల్స్ ఖాతాలో మూడో విజయం
ఐపీఎల్ తాజా సీజన్ లో మరో ఉత్కంఠభరిత మ్యాచ్ జరిగింది. రాజస్థాన్ రాయల్స్, లక్నో సూపర్ జెయింట్స్ మ్యాచ్ ఆఖరి ఓవర్ వరకు ఆసక్తిగా సాగింది. 166 పరుగుల లక్ష్యఛేదనలో లక్నో జట్టు 162 పరుగులు చేసింది. విజయానికి 4 పరుగుల దూరంలో ఆగిపోయింది. క్రీజులో భారీ హిట్టర్ మార్కస్ స్టొయినిస్ ఉన్నప్పటికీ మీడియం పేసర్ కుల్దీప్ సేన్ అద్భుతమైన బంతులు విసిరి కట్టడి చేశాడు. ఆఖరి ఓవర్లో లక్నో గెలుపునకు 15 పరుగులు అవసరం కాగా, కుల్దీప్ సేన్ 11 పరుగులే ఇచ్చాడు. దాంతో రాజస్థాన్ రాయల్స్ గెలుపు సంబరాలు చేసుకుంది.
స్టొయినిస్ 17 బంతుల్లో 2 ఫోర్లు, 4 సిక్సర్లతో 38 పరుగులు చేశాడు. అంతకుముందు క్వింటన్ డికాక్ 39, దీపక్ హుడా 25, కృనాల్ పాండ్యా 22 పరుగులు సాధించారు. ఇన్నింగ్స్ తొలి రెండు బంతులకే ట్రెంట్ బౌల్ట్... లక్నో కెప్టెన్ కేఎల్ రాహుల్, కృష్ణప్ప గౌతమ్ లను పెవిలియన్ చేర్చాడు. ఆ తర్వాత వచ్చిన జాసన్ హోల్డర్ (8) కూడా ఎక్కువ సేపు క్రీజులో నిలవలేకపోయాడు.