కుల్దీప్ యాదవ్ విజృంభణ... లక్ష్యఛేదనలో చేతులెత్తేసిన కోల్ కతా
- మొదట బ్యాటింగ్ చేసిన ఢిల్లీ
- 20 ఓవర్లలో 5 వికెట్లకు 215 పరుగులు
- లక్ష్యఛేదనలో 171 పరుగులు చేసిన కోల్ కతా
- ఒకే ఓవర్లో మూడు వికెట్లు తీసిన కుల్దీప్
ఢిల్లీ క్యాపిటల్స్ ఈ ఐపీఎల్ లో మళ్లీ విజయాల బాట పట్టింది. కోల్ కతా నైట్ రైడర్స్ తో జరిగిన మ్యాచ్ లో 44 పరుగుల తేడాతో విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన ఢిల్లీ క్యాపిటల్స్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లకు 215 పరుగుల భారీ స్కోరు సాధించింది.
అయితే, భారీ లక్ష్యఛేదనలో కోల్ కతా నైట్ రైడర్స్ 19.4 ఓవర్లలో 171 పరుగులకే ఆలౌట్ అయింది. కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ 54, నితీశ్ రాణా 30, ఆండ్రీ రసెల్ 24 పరుగులు చేశారు. చైనామన్ బౌలర్ కుల్దీప్ యాదవ్ అద్భుతంగా బౌలింగ్ చేసి 4 వికెట్లు తీసి కోల్ కతాను దెబ్బతీశాడు. కుల్దీప్ ఒకే ఓవర్లో 3 వికెట్లు పడగొట్టడం విశేషం. లెఫ్టార్మ్ సీమర్ ఖలీల్ అహ్మద్ 3, శార్దూల్ ఠాకూర్ 2 వికెట్లు తీశారు.
కాగా, నేటి రెండో మ్యాచ్ లో రాజస్థాన్ రాయల్స్, లక్నో సూపర్ జెయింట్స్ జట్లు తలపడుతున్నాయి. ముంబయిలోని వాంఖెడే స్టేడియం ఈ మ్యాచ్ కు వేదిక. టాస్ గెలిచిన లక్నో జట్టు బౌలింగ్ ఎంచుకుంది.