పదవీచ్యుతుడైన తర్వాత తొలిసారి స్పందించిన ఇమ్రాన్ ఖాన్

  • పాకిస్థాన్ లో అవిశ్వాస తీర్మానం
  • ప్రధాని పదవి నుంచి తప్పుకున్న ఇమ్రాన్
  • ట్విట్టర్ లో వ్యాఖ్యలు
  • మరో స్వాతంత్ర్య పోరాటం మొదలైందని వెల్లడి
క్రికెట్ లో ఎన్నో ఘనతలను తన పేరిట లిఖించుకున్న ఇమ్రాన్ ఖాన్ పాకిస్థాన్ రాజకీయ చరిత్రలో మాత్రం పరమ చెత్త రికార్డు సొంతం చేసుకున్నారు. అవిశ్వాస తీర్మానం ద్వారా ప్రధాని పదవిని కోల్పోయిన తొలినేతగా నిలిచారు. కాగా, పదవీచ్యుతుడైన తర్వాత ఇమ్రాన్ ఖాన్ తొలిసారిగా సోషల్ మీడియాలో స్పందించారు. 

దేశంలో మరో స్వాతంత్ర్య పోరాటం మొదలైందని వ్యాఖ్యానించారు. ఈసారి విదేశీ కుట్రలకు వ్యతిరేకంగా ఈ స్వతంత్ర పోరాటం ఉంటుందని వివరించారు.  1947లో పాకిస్థాన్ స్వతంత్ర దేశంగా అవతరించిందని తెలిపారు. ఈసారి జరిగే స్వాతంత్ర్య పోరాటం,  తమ ప్రభుత్వాన్ని గద్దె దింపేందుకు జరిగిన విదేశీ కుట్రలపైనే అని స్పష్టం చేశారు. ప్రజాస్వామ్యం, దేశ సార్వభౌమాధికారానికి ప్రజలే రక్షకులు అని ఇమ్రాన్ ఖాన్ పేర్కొన్నారు.


More Telugu News