మంత్రి పదవి కోల్పోయిన కొడాలి నానికి ఊరట
- ఏపీలో నూతన మంత్రివర్గం
- క్యాబినెట్ కూర్పుపై కసరత్తులు పూర్తి చేసిన సీఎం జగన్
- 25 మందితో జాబితా ఖరారు
- గవర్నర్ ఆమోదమే తరువాయి
- కొత్త క్యాబినెట్ లో కొడాలి నానికి నో చాన్స్
ఏపీలో నూతన మంత్రివర్గం ఖరారైన సంగతి తెలిసిందే. పలువురు మంత్రి పదవులు నిలుపుకోగా, పలువురికి నిరాశ తప్పలేదు. మంత్రి పదవి కోల్పోయిన వారిలో కొడాలి నాని కూడా ఉన్నారు. అయితే, కొడాలి నానికి ఏపీ ప్రభుత్వం కీలక పదవి అప్పగించనుంది. ఏపీ స్టేట్ డెవలప్ మెంట్ బోర్డు చైర్మన్ గా కొడాలి నానిని నియమించనున్నారు.
రాష్ట్రంలో ఇప్పటిదాకా ఏపీ స్టేట్ డెవలప్ మెంట్ బోర్డు లేదు. త్వరలోనే బోర్డును ఏర్పాటు చేసి, చైర్మన్ గా కొడాలి నానికి బాధ్యతలు అప్పగించనున్నారు. ఇక, ప్లానింగ్ బోర్డు వైస్ చైర్మన్ గా మల్లాది విష్ణు పేరు ఖరారైంది.