రేపు ఢిల్లీలో టీఆర్ఎస్ ఆధ్వర్యంలో భారీ ఎత్తున నిరసనలు: కల్వకుంట్ల కవిత
- కేంద్ర ప్రభుత్వం ధాన్యం కొనుగోళ్లు చేయాలి
- ఉదాసీనంగా వ్యవహరించకూడదు
- ఆ తీరు జాతీయ ఆహార భద్రత వ్యవస్థకు ప్రమాదకరమన్న కవిత
తెలంగాణ నుంచి కేంద్ర ప్రభుత్వం ధాన్యం కొనుగోళ్లు చేయాలంటూ టీఆర్ఎస్ నిరసనలు కొనసాగిస్తోంది. ఈ విషయంపై నిర్వహించిన మీడియా సమావేశంలో పలువురు నేతలతో కలిసి ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత మాట్లాడారు. వరి కొనుగోళ్ల విషయంలో కేంద్ర సర్కారు ఉదాసీనంగా వ్యవహరిస్తోందని కవిత విమర్శించారు.
రేపు ఢిల్లీలో తమ పార్టీ ఆధ్వర్యంలో భారీ ఎత్తున నిరసనలు చేపడుతున్నట్లు చెప్పారు. కేంద్ర ప్రభుత్వ తీరు జాతీయ ఆహార భద్రత వ్యవస్థకు ప్రమాదకరంగా మారిందని ఆమె మండిపడ్డారు. రైతులను పట్టించుకోక పోవడం వల్ల కలిగే పరిణామాల గురించి కేంద్ర ప్రభుత్వం ఆలోచించాలని ఆమె అన్నారు.
సీఎం కేసీఆర్ నేతృత్వంలోని తెలంగాణ ప్రభుత్వం రైతులకు అండగా నిలబడిందని ఆమె అన్నారు. పండించిన పంటకు ప్రతి రైతుకు తగిన ధర దక్కాలని ఆమె చెప్పారు. రేపు ఢిల్లీలో టీఆర్ఎస్ ధర్నా చేపట్టనున్న ప్రదేశాన్ని కవిత పలువురు నేతలతో కలిసి పరిశీలించారు.