ఏపీలో మంత్రుల ప్ర‌మాణానికి ఆహ్వానాలు పంపుతోన్న జీఏడీ

  • రేపు ఏపీ మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ
  • కేబినెట్‌లోకి కొత్త‌గా దాదాపు 15 మంది కొత్త వారు
  • కేబినెట్‌లో పాత‌వారు 8 నుంచి 10 మంది 
  • స‌చివాలయం ప‌క్క‌న పార్కింగ్ స్థ‌లంలో ప్ర‌మాణ స్వీకారోత్స‌వం
ఏపీ మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ కోసం అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తున్నారు. కేబినెట్‌లోకి కొత్త‌గా దాదాపు 15 మంది రాబోతున్నారు. పాత‌వారు 8 నుంచి 10 మంది వరకూ కేబినెట్‌లో ఉండ‌నున్నారు. కొత్త‌గా ఏర్ప‌డ్డ జిల్లాలు, సామాజిక కూర్పు వంటి అంశాల ఆధారంగా కొత్త వారిని సీఎం జ‌గ‌న్ కేబినెట్‌లోకి తీసుకోనున్నారు. 

రేపు కొత్త మంత్రివర్గం కొలువదీరనున్న నేప‌థ్యంలో ఇప్పటికే ఆయా నేత‌ల‌కు సమాచారం వెళ్లిన‌ట్లు తెలుస్తోంది. అలాగే, మంత్రుల ప్ర‌మాణ స్వీకారోత్స‌వానికి అతిథుల‌కు సాధారణ పరిపాలన విభాగం (జీఏడీ) ఆహ్వానాలు పంపుతోంది. రేపు ఉద‌యం 11.31 గంట‌ల‌కు కొత్త మంత్రుల ప్ర‌మాణ సీకారం జ‌ర‌గ‌నుంది. ఏపీ స‌చివాలయం ప‌క్క‌న పార్కింగ్ స్థ‌లంలో ఈ ప్ర‌మాణ స్వీకారోత్స‌వ కార్య‌క్ర‌మం జ‌ర‌గ‌నుంది.  



More Telugu News