శిథిలావస్థకు చేరుకున్న ఇంట్లో రూ. 1.42 కోట్లు.. విజిలెన్స్ సోదాల్లో వెలుగులోకి

  • ఒడిశా రాజధాని భువనేశ్వర్‌లో ఘటన
  • మైనర్ ఇరిగేషన్ సహాయ ఇంజినీర్ ఇంటిపై విజిలెన్స్ అధికారుల దాడి
  • రూ.4.76 కోట్ల నగదు, ఆస్తి వెలుగులోకి
శిథిలావస్థలో ఉన్న ఓ ఇంట్లో ఏకంగా రూ. 1.42 కోట్ల నగదు, బంగారం బయటపడింది. ఒడిశా రాజధాని భువనేశ్వర్‌లోని సలియాసాహి బస్తీలో ఈ ఘటన జరిగింది. గంజాం జిల్లా భంజనగర్ మైనర్ ఇరిగేషన్ విభాగంలో సహాయ ఇంజినీరు (ఏఈ)గా పనిచేస్తున్న కార్తికేశ్వర రవుళొ ఆస్తులపై అధికారులు మూడు రోజులుగా విజిలెన్స్ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. దర్యాప్తులో భాగంగా కార్తికేశ్వర రెండో భార్య కల్పనను పోలీసులు విచారించారు. 

ఈ సందర్భంగా తన సోదరి సలియాసాహి బస్తీలో ఓ శిథిలావస్థలో ఉన్న ఇంట్లో ఉంటోందని ఆమె తెలిపింది. దీంతో నిన్న ఆ ఇంటికి చేరుకున్న అధికారులు సోదాలు నిర్వహించి రూ. 1.42 కోట్ల నగదు, 345 గ్రాముల బంగారాన్ని గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. మొత్తంగా కార్తికేశ్వరకు సంబంధించి రూ. 4.76 కోట్ల విలువైన నగదు, ఆస్తి వెలుగులోకి వచ్చినట్టు విజిలెన్స్ అధికారులు తెలిపారు.


More Telugu News