ఇమ్రాన్ ఖాన్ ఆరోపణలకు బదులిచ్చిన అమెరికా

  • ఇటీవల రష్యాలో పర్యటించిన ఇమ్రాన్
  •  తాను పుతిన్ కలవడం ఓ పెద్ద దేశానికి ఇష్టంలేదన్న ఇమ్రాన్
  • తనకు వ్యతిరేకంగా కుట్ర పన్నిందని ఆరోపణ 
  • అమెరికా పేరెత్తకుండా పరోక్ష ఆరోపణలు
పాకిస్థాన్ లో తన ప్రభుత్వం ఎదుర్కొంటున్న సంక్షోభానికి కారణం అమెరికానే అంటూ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ పరోక్ష ఆరోపణలు చేయడం తెలిసిందే. అమెరికా పేరును నేరుగా ప్రస్తావించని ఇమ్రాన్ ఓ శక్తిమంతమైన అగ్రరాజ్యం అంటూ వ్యాఖ్యానించారు. తాను రష్యా పర్యటనలో పుతిన్ ను కలుసుకోవడం ఆ అగ్రరాజ్యానికి ఇష్టం లేదని, అందుకే తనకు వ్యతిరేకంగా కుట్ర పన్నిందని ఆరోపించారు. 

అయితే, ఇమ్రాన్ ఆరోపణలపై అమెరికా విదేశాంగ శాఖ ప్రతినిధి జలీనా పోర్టర్ స్పందించారు. ఇమ్రాన్ ఖాన్ చేస్తున్న ఆరోపణలు అవాస్తవాలు అని స్పష్టం చేశారు. పాకిస్థాన్ లో ప్రస్తుతం చోటుచేసుకుంటున్న పరిణామాలను తాము నిశితంగా గమనిస్తున్నామని, ఆ దేశ రాజ్యాంగ ప్రక్రియ పట్ల తమకు గౌరవం ఉందని పేర్కొన్నారు. పాకిస్థాన్ రాజ్యాంగ ప్రక్రియకు తాము మద్దతు ఇస్తున్నామని పేర్కొన్నారు.


More Telugu News