మళ్లీ లాభాల్లోకి విశాఖ ఉక్కు... ఆరేళ్ల తర్వాత లాభాల్లోకి సంస్థ
- ఆరేళ్లుగా నష్టాల్లోనే విశాఖ ఉక్కు
- మార్చితో ముగిసిన ఈ ఏడాదిలో లాభాల బాటలోకి
- రూ.835 కోట్ల లాభాన్ని ప్రకటించిన సీఎండీ
విశాఖ ఉక్కు తిరిగి లాభాల బాటలోకి వచ్చేసింది. ఆరేళ్లుగా ఏటా నష్టాలనే చవిచూస్తూ సాగుతున్న కంపెనీ.. 2021-22 ఆర్థిక సంవత్సరంలో తిరిగి లాభాల్లోకి వచ్చింది. ఈ మేరకు సంస్థ సీఎండీ అతుల్ భట్ శనివారం సాయంత్రం కీలక ప్రకటన చేశారు. ఈ ఏడాది సంస్థ రూ.835 కోట్ల మేర లాభం (పన్ను చెల్లింపునకు ముందు) ఆర్జించిందని ఆయన ప్రకటించారు.
ఈ ఏడాది ఏకంగా 57 శాతం మేర అధిక ఉత్పత్తిని సాధించిన విశాఖ ఉక్కు.. రూ.28,245 కోట్ల విలువైన అమ్మకాలను నమోదు చేసిన సంగతి తెలిసిందే. రికార్డు స్థాయిలో పెరిగిన విక్రయాలే కంపెనీకి లాభాలను తెచ్చి పెట్టాయని అతుల్ భట్ తెలిపారు.