ఉక్రెయిన్ రాజ‌ధానిలో బ్రిట‌న్ ప్ర‌ధాని.. జెలెన్‌స్కీతో భేటీ

  • కీవ్ చేరుకున్న బోరిస్ జాన్స‌న్‌
  • ఉక్రెయిన్‌కు మ‌రింత సాయంపై కీల‌క చ‌ర్చ‌లు
  • ఆర్థిక సాయంతో పాటు సైనిక సాయంపైనా మంత‌నాలు
ర‌ష్యా బాంబుల మోత‌తో ద‌ద్ద‌రిల్లుతున్న ఉక్రెయిన్‌లో శ‌నివారం రాత్రి కీల‌క ప‌రిణామం చోటుచేసుకుంది. యుద్ధ భ‌యంతో ఉక్రెయిన్ వాసుల్లో మెజారిటీ శాతం మంది ప్ర‌జ‌లు ఇప్ప‌టికే త‌మ దేశాన్ని వీడిపోగా.. అందుకు విరుద్ధంగా ఉక్రెయిన్‌లో ప‌ర్య‌టించేందుకు బ్రిట‌న్ ప్ర‌ధాన మంత్రి బోరిస్ జాన్స‌న్ వ‌చ్చారు. 

శ‌నివారం సాయంత్రం ఆయ‌న ఉక్రెయిన్ రాజ‌ధాని కీవ్‌లో ప్ర‌త్య‌క్ష‌మ‌య్యారు. కీవ్‌లోకి అడుగు పెట్టినంత‌నే ఆయ‌న ఉక్రెయిన్ అధ్య‌క్షుడు వొలొదిమిర్ జెలెన్‌స్కీతో భేటీ అయ్యారు. ఉక్రెయిన్‌కు దీర్ఘ‌కాలిక సాయంతో పాటు మరింత మేర ఆర్థిక‌, సైనిక సాయాన్ని చేసే దిశ‌గా ఇద్ద‌రు నేత‌లు చ‌ర్చిస్తున్నారు.


More Telugu News