రాజ్ భవన్‌కు చేరిన రాజీనామాలు.. కాసేపట్లో మాజీలుగా ఏపీ మంత్రులు
- ఈ నెల 7న రాజీనామాలు చేసిన మంత్రులు
- శనివారం సాయంత్రం దాకా ప్రభుత్వం వద్దనే పత్రాలు
- శనివారం రాత్రి రాజ్ భవన్‌కు చేరిన రాజీనామాలు
- గవర్నర్ ఆమోదంతో మాజీలుగా మంత్రులు
ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కేబినెట్‌లోని 24 మంత్రులు మరికాసేపట్లో మాజీ మంత్రులుగా మారిపోనున్నారు. ఈ నెల 7న జరిగిన కేబినెట్ భేటీలోనే మొత్తం 24 మంది చేత రాజీనామా పత్రాలు తీసుకున్న జగన్ శనివారం సాయంత్రం దాకా గవర్నర్‌కు పంపలేదు. తాజాగా శనివారం సాయంత్రం మంత్రుల రాజీనామా పత్రాలు విజయవాడలోని రాజ్ భవన్‌కు చేరాయి.
మంత్రుల రాజీనామాలను గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ కాసేపట్లో ఆమోదించనున్నారు. రాజీనామాలకు గవర్నర్ ఆమోదం లభించిన మరుక్షణమే మంత్రులంతా మాజీ మంత్రులుగా మారిపోనున్నారు. మరి వీరిలో ఎందరిని జగన్ తన కొత్త కేబినెట్‌లోకి తీసుకుంటారోనన్న ఆసక్తి, కుతూహలం అందరిలోనూ వున్నాయి.