దోచిన భూములన్నీ నిరూపిస్తా.. దమ్ముంటే ఆపు: విజయసాయిరెడ్డికి బుద్ధా వెంకన్న సవాల్
- ఏప్రిల్ 21న వివరాలు వెల్లడిస్తానన్న వెంకన్న
- విశాఖలోనే వివరాలు చెబుతానని వ్యాఖ్య
- సవాల్ తో కూడిన వీడియోను పోస్ట్ చేసిన వెంకన్న
వైసీపీ పార్లమెంటరీ పార్టీ నేత వేణుంబాక విజయసాయిరెడ్డికి టీడీపీ కీలక నేత బుద్ధా వెంకన్న శనివారం సవాల్ విసిరారు. విజయసాయి రెడ్డి దోచుకున్న భూములన్నీ సర్వే నంబర్లతో సహ ఏప్రిల్ 21 న విశాఖలోనే నిరూపిస్తానని చెప్పిన బుద్ధా వెంకన్న.. దమ్ముంటే ఆపాలంటూ సాయిరెడ్డికి సవాల్ విసిరారు. ఈ మేరకు కాసేపటి క్రితం తన సవాల్‌తో కూడిన వీడియోను బుద్ధా వెంకన్న ట్విట్టర్లో పోస్ట్ చేశారు.
విశాఖలో పెద్ద ఎత్తున భూములను కబ్జా చేస్తున్నారని తనపై టీడీపీ తప్పుడు ప్రచారం చేస్తోందని ఆరోపించిన సాయిరెడ్డి.. ఈ వ్యవహారంపై శుక్రవారం నాడు విశాఖలోని పీఎం పాలెం పోలీసులకు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. భూకబ్జాలు అంటూ తన, తన కుటుంబ సభ్యుల ప్రతిష్ఠకు భంగం కలిగేలా టీడీపీ ఆరోపణలు గుప్పిస్తోందని, ఆ పార్టీపై చర్యలు తీసుకోవాలంటూ సాయిరెడ్డి ఆ ఫిర్యాదులో పోలీసులను కోరిన సంగతి తెలిసిందే. ఈ పరిణామంపై ఘాటుగా రియాక్ట్ అయిన బుద్ధా వెంకన్న నేరుగా సాయిరెడ్డికే సవాల్ విసురుతూ కీలక వ్యాఖ్యలు చేశారు.