సీరం బాట‌లోనే భార‌త్ బ‌యోటెక్‌!.. రూ.225ల‌కే కోవాగ్జిన్!

  • కోవిషీల్డ్ ధ‌ర‌ను త‌గ్గించిన సీరం
  • ఆ వెంట‌నే కోవాగ్జిన్ ధ‌ర త‌గ్గింపు
  • రూ.1,200ల నుంచి రూ.225కు త‌గ్గిస్తున్న‌ట్లు సుచిత్రా ఎల్లా ప్ర‌క‌ట‌న‌
క‌రోనా మ‌హ‌మ్మారి బారి నుంచి ర‌క్ష‌ణ కోసం వినియోగిస్తున్న వ్యాక్సిన్ పంపిణీకి సంబంధించి తొలి రెండు డోసుల‌ను ఉచితంగానే పంపిణీ చేసిన కేంద్రం.. తాజాగా బూస్ట‌ర్ డోసును మాత్రం కొనుక్కోవాల్సిందేన‌ని ప్ర‌జ‌ల‌కు తేల్చి చెప్పిన సంగ‌తి తెలిసిందే. అయితే వృద్ధులు, ఫ్రంట్ లైన్ వారియ‌ర్స్‌కు మాత్రం ఉచితంగా ఇస్తామ‌న్న కేంద్రం.. మిగిలిన వారంతా బూస్ట‌ర్ డోసుకు రుసుము చెల్లించాల్సిందేన‌ని తేల్చేసిన సంగ‌తి తెలిసిందే.

అయితే దేశీయ వ్యాక్సిన్ త‌యారీ సంస్థ‌లు సీరం, భార‌త్ బ‌యోటెక్‌లు బూస్ట‌ర్ డోసుల ధ‌ర‌ల‌ను కాస్తంత అధికంగా నిర్ణ‌యించాయ‌న్న వాద‌న వినిపించింది. దీనిపై పున‌రాలోచ‌న చేసిన సీరం ఇన్‌స్టిట్యూట్ త‌న కోవిషీల్డ్ ధ‌ర‌ను రూ.600ల నుంచి రూ.225కు త‌గ్గించింది. సీరం నుంచి ప్ర‌క‌ట‌న వ‌చ్చినంత‌నే భార‌త్ బ‌యోటెక్ కూడా త‌న కోవాగ్జిన్ ధ‌ర‌ను రూ.1,200ల నుంచి రూ.225కు త‌గ్గించింది. ఈ మేరకు కాసేప‌టి క్రితం భార‌త్ బ‌యోటెక్ జాయింట్ ఎండీ సుచిత్రా ఎల్లా ఓ ప్ర‌క‌ట‌న విడుద‌ల చేశారు. వెర‌సి బూస్ట‌ర్ డోసును ఈ రెండు సంస్థ‌లు రూ.225ల‌కే అందించేందుకు సిద్ధ‌మ‌య్యాయి.


More Telugu News