విదేశాలకు పారిపోయే యోచనలో శ్రీలంక ప్రధాని మహీంద రాజపక్స?

  • శ్రీలంకలో మరింత దిగజారిన పరిస్థితులు
  • రాజపక్స సోదరులపై పెల్లుబుకుతున్న ప్రజాగ్రహం
  • ప్రధాని ప్రాణాలకు ముప్పు పొంచి ఉందనే వార్తలు
శ్రీలంకలో పరిస్థితులు నానాటికీ దిగజారుతున్నాయి. అక్కడ నెలకొన్న ఆర్థిక, ఆహార సంక్షోభం దేశాన్ని కుదిపేస్తోంది. ఈ పరిస్థితికి మీరే కారణమంటూ అధ్యక్షుడు గొటబాయ రాజపక్స, ప్రధాన మంత్రి మహీంద రాజపక్సలపై ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రాజీనామా చేయండి, జైలుకు వెళ్లండి అంటూ నినాదాలు చేస్తూ, ప్లకార్డులు పట్టుకుని ఆందోళన కార్యక్రమాలు చేపడుతున్నారు.

సాక్షాత్తు సైన్యం రంగంలోకి దిగినా జనాలు ఏ మాత్రం తగ్గడం లేదు. అధ్యక్షుడు, ప్రధాని భవనాలపై దాడి చేసేందుకు సైతం యత్నిస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రధాని ప్రాణాలకు ముప్పు పొంచి ఉందనే వార్తలు వస్తున్నాయి. మరోవైపు, ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో దేశాన్ని విడిచి విదేశాలకు పారిపోయే యోచనలో ప్రధాని మహీంద రాజపక్స ఉన్నట్టు జోరుగా ప్రచారం జరుగుతోంది.


More Telugu News