బ్రోక‌ర్ల మాఫియాతో కేసీఆర్ కుమ్మ‌క్కు.. రైతుల‌కు లేఖ‌లో బండి సంజ‌య్‌ ధ్వజం

  • 'రైతులు త‌క్కువ ధ‌ర‌కే ధాన్యం అమ్ముకునేలా కేసీఆర్ ప్లాన్‌' అంటూ సంజయ్ విమర్శలు 
  • కొనుగోలు కేంద్రాల మూత వెనుక పెద్ద కుట్ర‌ ఉందని వ్యాఖ్య 
  • రైతుల ఆగ్ర‌హాన్ని కేంద్రంపైకి మ‌ళ్లించడ‌మే వారి ల‌క్ష్య‌మ‌న్న సంజ‌య్‌
ధాన్యం కొనుగోలుకు సంబంధించి బ్రోక‌ర్ల మాఫియాతో సీఎం కేసీఆర్ కుమ్మ‌క్క‌య్యార‌ని బీజేపీ తెలంగాణ అధ్య‌క్షుడు, క‌రీంన‌గ‌ర్ ఎంపీ బండి సంజ‌య్ ఆరోపించారు. తెలంగాణ‌లో ఈ యాసంగిలో పండ‌నున్న మొత్తం ధాన్యాన్ని కేంద్ర‌మే కొనుగోలు చేయాలంటూ టీఆర్ఎస్ డిమాండ్‌.. దానికి బ‌దులుగా టీఆర్ఎస్ వ్య‌వ‌హ‌రిస్తున్న తీరుపై బీజేపీ ఆరోప‌ణ‌ల నేప‌థ్యంలో... అస‌లు వాస్త‌వాలు ఇవేనంటూ బండి సంజ‌య్ శ‌నివారం రైతుల‌కు ఓ బ‌హిరంగ లేఖ‌ను విడుద‌ల చేశారు. ఈ లేఖ‌లో ఆయన ప‌లు కీల‌క అంశాల‌ను ప్ర‌స్తావించారు.

ధాన్యం కొనుగోళ్ల‌లో భారీ ఎత్తున క‌మీష‌న్లు దండుకునేందుకు టీఆర్ఎస్ నేత‌లు స్కెచ్ వేశారని బండి సంజ‌య్ ఆరోపించారు. ఈ క్ర‌మంలో రైతులు త‌క్కువ ధ‌ర‌కే ధాన్యం విక్ర‌యించేలా ప్లాన్ ర‌చించార‌ని ఆయ‌న పేర్కొన్నారు. రైతుల్లో వెల్లువెత్తే ఆగ్ర‌హాన్ని కేంద్రంపైకి మ‌ళ్లించే కుట్ర‌లో భాగంగానే ధాన్యం కొనుగోలు కేంద్రాల‌ను మూసివేశార‌ని ఆయ‌న ధ్వ‌జ‌మెత్తారు.

 కేసీఆర్ ర‌చించిన ఈ కుట్ర‌లో అన్న‌దాత‌ల‌కు భారీ ఎత్తున న‌ష్టం వాటిల్లే ప్ర‌మాద‌ముంద‌ని కూడా ఆయ‌న ఆరోపించారు. ధాన్యం కొనుగోలు కేంద్రాల‌ను తిరిగి తెరిచేలా కేసీఆర్ మెడ‌లు వంచుదాం రండి అంటూ ఆయ‌న రైతుల‌కు పిలుపునిచ్చారు.


More Telugu News