ఐపీఎల్: తొలి గెలుపు కోసం సన్ రైజర్స్, చెన్నై జట్ల తహతహ

  • ఐపీఎల్ లో నేడు రెండు మ్యాచ్ లు
  • తొలి మ్యాచ్ లో చెన్నై వర్సెస్ సన్ రైజర్స్
  • టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న సన్ రైజర్స్
  • రెండో మ్యాచ్ లో బెంగళూరుతో ముంబయి ఇండియన్స్ ఢీ
ఐపీఎల్ తాజా సీజన్ లో కొన్ని మ్యాచ్ లు హోరాహోరీగా సాగుతున్నాయి. కొత్త జట్లు గుజరాత్ టైటాన్స్, లక్నో సూపర్ జెయింట్స్ విశేషంగా రాణిస్తుండగా.... పాత జట్లు చెన్నై సూపర్ కింగ్స్, సన్ రైజర్స్ హైదరాబాద్, ముంబయి ఇండియన్స్ దారుణమైన ఆటతీరుతో పాయింట్ల పట్టికలో కిందిభాగంలో ఉన్నాయి. వారాంతం కావడంతో నేడు రెండు మ్యాచ్ లు నిర్వహిస్తున్నారు. 

ఆడిన రెండు మ్యాచ్ ల్లో ఒక్క విజయం సాధించని సన్ రైజర్స్ హైదరాబాద్, ఆడిన మూడు మ్యాచ్ లు ఓడిపోయిన చెన్నై సూపర్ కింగ్స్ అమీతుమీ తేల్చుకోనున్నాయి. ముంబయి డీవై పాటిల్ స్టేడియం ఈ మ్యాచ్ కు వేదిక. టాస్ గెలిచిన సన్ రైజర్స్ ఎప్పట్లాగానే బౌలింగ్ ఎంచుకుంది. గెలుపు రుచి చూసేందుకు తహతహలాడుతున్న సన్ రైజర్స్ ఈ మ్యాచ్ కోసం జట్టులో రెండు మార్పులు చేసింది. అబ్దుల్ సమద్, రొమారియో షెపర్డ్ ల స్థానంలో శశాంక్ సింగ్, మార్కో జాన్సెన్ లను తుదిజట్టులోకి తీసుకుంది. 

కాగా, నేటి రెండో మ్యాచ్ లో ముంబయి ఇండియన్స్ జట్టు రాయల్ చాలెంజర్స్ బెంగళూరుతో తలపడనుంది. ముంబయి ఇండియన్స్ జట్టు ఇప్పటివరకు 3 మ్యాచ్ లు ఆడగా, అన్నింటా ఓటమిపాలైంది. డుప్లెసిస్ నాయకత్వంలోని బెంగళూరు జట్టు మెరుగైన స్థితిలో ఉంది. ఆడిన 3 మ్యాచ్ ల్లో రెండింట నెగ్గింది.
.


More Telugu News