సీబీఐ విచారణ చేస్తే రాజీనామా చేసిన మంత్రులంతా జైలుకే: బొండా ఉమా
- జగన్ అవినీతి అనకొండ అంటూ ఉమా కామెంట్
- జగన్ కేబినెట్‌లో పెద్ద దొంగ పెద్దిరెడ్డి అని వ్యాఖ్య
- పెద్దిరెడ్డి అక్రమార్జన రూ.2 వేల కోట్లన్న బొండా ఉమా
టీడీపీ కీలక నేత, విజయవాడ సెంట్రల్ మాజీ ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు వైసీపీ ప్రభుత్వంపై తీవ్ర వ్యాఖ్యలతో విరుచుకుపడ్డారు. ఈ మేరకు శనివారం మీడియాతో మాట్లాడిన సందర్భంగా సీఎం జగన్ సహా, ఇటీవలే మంత్రి పదవులకు రాజీనామాలు చేసిన వైసీపీ నేతలు, ప్రత్యేకించి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిపై ఆయన ఘాటు విమర్శలు గుప్పించారు.
ఈ సందర్భంగా ఉమా మాట్లాడుతూ... "జగన్ అవినీతి అనకొండ. జగన్ కేబినెట్ మొత్తం ఓ దొంగల ముఠా. జగన్ కేబినెట్‌లో అతి పెద్ద దొంగ పెద్దిరెడ్డి. మూడేళ్ల కాలంలోనే పాలరైతుల పొట్టకొట్టి పెద్దిరెడ్డి రూ.700 కోట్లు సంపాదించారు. చిత్తూరు జిల్లాలో భూకబ్జాలతో పెద్దిరెడ్డి రూ.800 కోట్లు సంపాదించారు.
పల్ప్ కంపెనీ ద్వారా మామిడి రైతుల నుంచి పెద్దిరెడ్డి రూ.190 కోట్లు దోపిడీ చేశారు. పెద్దిరెడ్డి అక్రమార్జన రూ.2 వేల కోట్లకు పైగా ఉంటుంది. అక్రమార్జనతో ఓట్లను కొనుగోలు చేయాలనేది జగన్ వ్యూహం. జగన్ ప్రభుత్వంపై సీబీఐ విచారణ చేస్తే.. రాజీనామాలు చేసిన మంత్రులంతా జైలుకెళ్లడం ఖాయం" అని ఆయన విరుచుకుపడ్డారు.