మంత్రి పదవి ఆశావహుల జాబితాలో నేను కూడా ఉన్నా: వైసీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి
- 11వ తేదీన కొలువుతీరనున్న కొత్త మంత్రివర్గం
- తనకు మంత్రి పదవిని ఇవ్వడం జగన్ ఇష్టమన్న కోటంరెడ్డి
- ఈ నెల 11 నుంచి నియోజకవర్గంలోని ప్రతి ఇంటికి వెళ్తానని వ్యాఖ్య
ఏపీలో ఈ నెల 11న కొత్త మంత్రి వర్గం కొలువుతీరనున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే మంత్రులందరూ తమ రాజీనామా లేఖలను ఇచ్చేశారు. పాత మంత్రుల్లో ఎవరు పదవుతను నిలుపుకుంటారు? కొత్తగా పదవిని చేజిక్కించుకునే అదృష్టవంతులు ఎవరు? అనే చర్చ పెద్ద ఎత్తున సాగుతోంది. ఈ నేపథ్యంలో నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
కొత్త మంత్రివర్గంలో తనకు స్థానం ఉంటుందా? లేదా? అనే విషయం తనకు తెలియదని చెప్పారు. అయితే, ఆశావహుల జాబితాలో మాత్రం తాను ఉన్నానని అన్నారు. ప్రతి ఎమ్మెల్యేకి మంత్రి కావాలనే కోరిక ఉండటం సహజమేనని చెప్పారు. తనకు మంత్రి పదవిని ఇవ్వడమనేది జగన్ ఇష్టమని అన్నారు. జగన్ ఎవరికి మంత్రి పదవి ఇచ్చినా అందరూ ఏకీభవిస్తారని చెప్పారు. ఈ నెల 11వ తేదీ నుంచి నియోజకవర్గంలోని ప్రతి ఇంటికి వెళ్తానని, ప్రజల సమస్యలు తెలుసుకుని పరిష్కరిస్తానని అన్నారు.