విద్యుత్ కోతల వ‌ల్ల కార్మికులకు ఉపాధి పోతుంది.. పంటలకు నీరంద‌దు: చంద్ర‌బాబు

  • రైతులు మరిన్ని ఇబ్బందులు ఎదుర్కొంటారన్న చంద్రబాబు 
  • గ్రామాల్లో జ‌గ‌న్ విద్యుత్తును పీకేస్తున్నారని విమర్శ 
  • ఆయ‌న‌ను ముఖ్య‌మంత్రి పదవి నుంచి పీకేసేందుకు ప్ర‌జ‌లు సిద్ధంగా ఉన్నారన్న చంద్ర‌బాబు  
ఏపీలో విద్యుత్ చార్జీల పెరుగుద‌ల‌, క‌రెంటు కోత‌ల‌పై టీడీపీ ఆందోళ‌న‌లు నిర్వ‌హిస్తోన్న విష‌యం తెలిసిందే. దీనిపై ఆ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ఈ రోజు త‌మ పార్టీ నేత‌ల‌తో క‌లిసి స‌మీక్షా స‌మావేశం నిర్వ‌హించారు. ప్ర‌తి టీడీపీ నేత ఈ ఆందోళ‌న కార్య‌క్ర‌మాల్లో పాల్గొనాల‌ని ఆయ‌న చెప్పారు. క్షేత్ర స్థాయికి వెళ్లి ప్ర‌జ‌లకు ప్ర‌భుత్వ వైఫ‌ల్యాల‌ను వివ‌రించి చెప్పాల‌ని అన్నారు. 

ఏపీలో విద్యుత్ కోతలు, పెరిగిన కరెంట్ చార్జీలపై ప్ర‌జ‌లు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారని ఆయ‌న చెప్పారు. ఏపీలో పరిశ్రమలకు విద్యుత్ కోతలు ఇలాగే కొన‌సాగితే కార్మికులకు ఉపాధి క‌రవ‌వుతుంద‌ని ఆందోళ‌న వ్య‌క్తం చేశారు. అలాగే, పంటలకు నీరందక రైతులు మరింత ఇబ్బందులు ఎదుర్కొంటార‌ని చెప్పారు. గ్రామాల్లో జ‌గ‌న్ విద్యుత్తును పీకేస్తున్నార‌ని, ఆయ‌న‌ను ముఖ్య‌మంత్రి పదవి నుంచి పీకేసేందుకు ప్ర‌జ‌లు సిద్ధంగా ఉన్నారని చంద్రబాబు అన్నారు.


More Telugu News