బీహార్ లో స్టీల్ బ్రిడ్జినే ఎత్తుకుపోయిన దొంగలు

  • రోహ్తస్ జిల్లాలో వెలుగులోకి
  • 60 అడుగుల పొడవాటి స్టీల్ వంతెన ధ్వంసం
  • బుల్డోజర్లు, కట్టర్లతో వచ్చిన దొంగలు
  • వీలైనంత తుక్కుతో పరారీ
బీహార్ లో తుక్కు దొంగలు ఏకంగా ఇనుప వంతెననే ఎత్తుకుపోయారు. చిన్న, చిన్నవి చిల్లరగా ఎత్తుకుపోయి అమ్ముకుంటే వచ్చేదేమి, మిగిలేదేమి అనుకున్నారేమో.. బుల్డోజర్, కట్టర్లతో వచ్చి పొడవాటి బ్రిడ్జికి ఎసరు పెట్టారు. 

బీహార్ లోని రోహ్తాస్ జిల్లాలో మూడు రోజుల క్రితం జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. అమియావర్ గ్రామ సమీపంలోని ఆర-సోనే కాలువపై 60 అడుగుల స్టీల్ వంతెన ఉంది. దీన్ని 45 ఏళ్ల క్రితం నిర్మించారు. పాతది అయిపోవడంతో దీనికి సమాంతరంగా పక్కనే మరో కాంక్రీట్ బ్రిడ్జ్ కట్టారు. దీంతో స్టీల్ బ్రిడ్జ్ నిరుపయోగంగా ఉంది. దీనిని గమనించిన దొంగలు ఒకరోజు దీనికి స్పాట్ పెట్టేశారు.

కాకపోతే అంత పొడవాటి స్టీల్ వంతెనను తుక్కు చేసి తరలించడం ఒక్క రాత్రితో సాధ్యం కాదన్న ఆలోచన వారికి తట్టలేదు. అయిన కాడికి ఎత్తుకుపోయి, మిగిలింది అక్కడే వదిలేశారు. దొంగలు బుల్డోజర్లు, గ్యాస్ కట్టర్లతో వచ్చి ఈ పని చేసినట్టు పోలీసు ఆఫీసర్ సుభాష్ కుమార్ వెల్లడించారు. దీనిపై నీటి వనరుల జూనియర్ ఇంజనీర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.


More Telugu News