ఆంధ్రజ్యోతి నా గురించి నీచంగా రాస్తోంది.. పరువునష్టం దావా వేస్తా: బాలినేని
- నాకు పార్టీనే ముఖ్యం, మంత్రి పదవి కాదని ఎప్పుడో చెప్పానన్న బాలినేని
- తనపై విష ప్రచారాన్ని ఆ పత్రిక మానుకోవాలని సూచన
- జగన్ కు తాను వీరాభిమానినని చెప్పిన బాలినేని
ప్రముఖ మీడియా సంస్థ ఆంధ్రజ్యోతిపై ఏపీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తనకు పార్టీనే ముఖ్యమని, మంత్రి పదవి కాదని తాను ఎప్పుడో చెప్పానని... అయినా ఆంధ్రజ్యోతి తన గురించి చాలా నీచంగా రాస్తోందని ఆయన మండిపడ్డారు. ఇప్పటికైనా తనపై విష ప్రచారాన్ని మానుకోకపోతే ఆ పత్రికపై పరువునష్టం దావా వేస్తానని హెచ్చరించారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు.
వైయస్ రాజశేఖరరెడ్డి మరణం తర్వాత నాలుగేళ్ల ముందే మంత్రి పదవిని వదులుకుని వైయస్ జగన్ వెనుక నిలబడ్డానని బాలినేని అన్నారు. జగన్ కు తాను వీరాభిమానినని చెప్పారు. కేబినెట్ మొత్తాన్ని తొలగిస్తున్నానని జగన్ అన్నప్పుడే తాను బహిరంగంగా పూర్తి మద్దతును ప్రకటించానని అన్నారు.