సుజుకీ నుంచి టూరర్ బైక్.. వీ-స్టార్మ్ ఎస్ఎక్స్ విడుదల
- ఎక్స్ షోరూమ్ ధర రూ.2.12 లక్షలు
- పట్టణాలు, హైవేలకు అనుకూలం
- 249సీసీ సామర్థ్యంతో కూడిన ఇంజన్
సుజుకీ మోటార్ సైకిల్ ఇండియా భారత మార్కెట్లోకి టూరర్ బైక్ ను విడుదల చేసింది. వీ స్టార్మ్ ఎక్స్ అడ్వెంచర్ టూరర్ పేరుతో విడుదలైన ఈ బైక్ ఎక్స్ షోరూమ్ ధర రూ.2.12 లక్షలు. ఈ బైక్ తో 250సీసీ ఏడీవీ విభాగంలో సుజుకీ మోటార్ సైకిల్ అడుగు పెట్టింది. రోజువారీగా ప్రయాణించేందుకు, హైవేలపై నడిపేందుకు అనుకూలంగా ఇది ఉంటుంది.
దీని డైమన్షన్స్ చూస్తే పట్టణాల్లోనూ సౌకర్యంగానే నడుపుకునే వీలుంటుందని తెలుస్తోంది. ఛాంపియన్ ఎల్లో, పెర్ల్ బ్లేజ్ ఆరెంజ్, గ్లాస్ స్పార్కిల్ బ్లాక్ రంగుల్లో లభిస్తుంది. టూరర్ విభాగంలో రాయల్ ఎన్ ఫీల్డ్ సంస్థ అధిక వాటాతో లీడర్ గా ఉంది. దీంతో ఈ విభాగంలో అవకాశాలను సొంతం చేసుకునేందుకు ఇతర కంపెనీల్లోనూ ఆసక్తి కనిపిస్తోంది. హోండా, హీరో, కేటీఎం ఈ విభాగంలో పలు మోడళ్లను తీసుకొచ్చాయి.
సుజుకీ వీస్మార్ట్ బైక్ లో 249సీసీ 4స్ట్రోక్, సింగిల్ సిలిండర్ ఆయిల్ కూల్డ్ ఎస్ వో హెచ్ సీ ఇంజన్ ఉంటాయి. సుజుకీ ఈజీ స్టార్ట్ సిస్టమ్, యూఎస్ బీ అవుట్ లెట్ ఇలా ఎన్నో కొత్త ఫీచర్లు ఇందులో ఉన్నాయి.