వామ్మో ఇంత పెద్ద క్యూనా?.. శ్రీవారి సర్వదర్శన టోకెన్ల కోసం పోటెత్తిన భక్తులు
- ఇవాళ టోకెన్లను విడుదల చేసిన తిరుమల
- టోకెన్లు పొందిన వారికి 12 లోపు దర్శన స్లాట్
- రేపు, ఎల్లుండి టోకెన్లు విడుదల చేయట్లేదన్న టీటీడీ
- బుధవారం నాటి టోకెన్లను మంగళవారమే ఇస్తామని వెల్లడి
కరోనా తీవ్రత తగ్గుముఖం పట్టడంతో తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) శ్రీవారి దర్శన టికెట్లను క్రమంగా పెంచుతోంది. ఈ క్రమంలోనే భక్తులు భారీ సంఖ్యలో కలియుగ దైవం దర్శనం కోసం భారీగా తరలివస్తున్నారు. ఇవాళ సర్వదర్శనం టోకెన్లను టీటీడీ విడుదల చేయడంతో పెద్ద సంఖ్యలో భక్తులు టోకెన్ల కోసం పోటెత్తారు. తిరుపతిలోని శ్రీనివాస, భూదేవి కాంప్లెక్స్ కౌంటర్ల వద్ద భారీ సంఖ్యలో క్యూ కట్టారు.
ఇవాళ సర్వదర్శనం టోకెన్లు పొందిన వారికి ఈ నెల 12లోపు దర్శన స్లాట్ లభిస్తుందని టీటీడీ తెలిపింది. భక్తుల రద్దీ అధికంగా ఉన్న నేపథ్యంలో బుధవారం విడుదల చేయాలనుకున్న సర్వదర్శన టోకెన్లను ఒకరోజు ముందే.. అంటే మంగళవారమే విడుదల చేయాలని టీటీడీ నిర్ణయించింది. ఆది, సోమవారాల్లో దర్శన టోకెన్లను విడుదల చేయడం లేదని, భక్తులు సహకరించాలని కోరింది.