కెనడాలో కాల్పులకు భారత విద్యార్థి బలి

  • సబ్ వే స్టేషన్ వద్ద ఉండగా ఆగంతుకుడి కాల్పులు
  • భారత విద్యార్థి కార్తీక్ వాసుదేవ్ కు తీవ్ర గాయాలు
  • ఆసుపత్రికి తరలించగా అక్కడ మృతి
కెనడాలోని టొరంటోలో కాల్పులకు భారత విద్యార్థి బలయ్యాడు. పట్టణంలోని సబ్ వే స్టేషన్ వద్ద జరిగిన కాల్పుల్లో  21 ఏళ్ల కార్తీక్ వాసుదేవ్ కు చాలా చోట్ల బుల్లెట్ గాయాలు కావడంతో వెంటనే ఆసుపత్రికి తరలించారు. అనంతరం అక్కడే చికిత్స పొందుతూ ప్రాణాలు విడిచాడు. ఓ ఆగంతుకుడు తుపాకీతో ఈ దారుణానికి పాల్పడ్డాడు. గురువారం రాత్రి ఈ ఘటన జరిగింది. భారత విద్యార్థి దుర్మరణం పట్ల భారత ఎంబసీ షాక్ కు గురైంది. 

కార్తీక్ వాసుదేవ్ మృతదేహాన్ని భారత్ కు త్వరగా పంపించేందుకు వీలుగా తమవంతు సహకారం అందించనున్నట్టు ప్రకటించింది. కార్తీక్ వాసుదేవ్ కుటుంబంతో సంప్రదింపులు చేస్తున్నామని తెలిపింది. భారత విద్యార్థి మరణించడం పట్ల విదేశాంగ మంత్రి జైశంకర్ కూడా విచారం వ్యక్తం చేశారు. వాసుదేవ్ కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు. 

కార్తీక్ వాసుదేవ్ మార్కెటింగ్ మేనేజ్ మెంట్ ప్రోగ్రామ్ చదివేందుకు జనవరిలో టొరొంటోకు వెళ్లాడు. సెనెకా కాలేజీలో అతడికి అడ్మిషన్ లభించింది. అతను ఫస్ట్ సెమిస్టర్ విద్యార్థి.



More Telugu News