పాయల్ ఆశలన్నీ 'గాలి నాగేశ్వరరావు' పైనే!

  • గ్లామరస్ హీరోయిన్ గా పాయల్ కి క్రేజ్
  • మంచు విష్ణు సరసన అవకాశం
  • సెకండ్ షెడ్యూల్ చిత్రీకరణలో సినిమా 
  • మరో కథానాయికగా సన్నీ లియోన్  
పాయల్ పేరు వినగానే నిలువెత్తు అందం గుర్తుకు వస్తుంది. కైపు కళ్లతో తెరపై ఆమె చేసే గారడీ గుర్తుకు వస్తుంది. అందంతో పాటు అభినయం కూడా పాయల్ లో సమపాళ్లలో కనిపిస్తుంది. అయితే అదృష్టమే ఆమెకి అందుబాటులోకి రాకుండా తప్పించుకుని తిరుగుతోంది. స్టార్ హీరోల సరసన ఛాన్సులు .. బలమైన హిట్లు పడకపోవడమే ఆమె బలహీనతగా మారిపోయింది.

 'డిస్కోరాజా' .. 'వెంకీమామ' వంటి పెద్ద సినిమాలు కూడా ఆమె కెరియర్లో కనిపిస్తాయి. ఆమె గ్లామర్ కి ఎప్పుడూ తక్కువ మార్కులు పడలేదు. యూత్ లో ఆమెకి ఉన్న క్రేజ్ తగ్గలేదు. ఈ నేపథ్యంలోనే ఆమెకి మంచు విష్ణు జోడీగా ఛాన్స్ వచ్చింది. ఆయన హీరోగా పొంత బ్యానర్లో నిర్మితమవుతున్న 'గాలి నాగేశ్వరరావు' సెట్స్ పైకి వెళ్లింది. 

ఈ సినిమాలో మరో హీరోయిన్ గా సన్నీలియోన్  నటిస్తోంది. ప్రస్తుతం ఈ సినిమా సెకండ్ షెడ్యూల్ షూటింగ్ జరుగుతోంది. ఈషాన్ సూర్య దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాకి, కోన వెంకట్ స్క్రీన్ ప్లే అందించాడు. అనూప్ రూబెన్స్ సంగీతాన్ని సమకూర్చాడు. ఈ సినిమా తన కెరియర్ కి హెల్ప్ అవుతుందనే బలమైన నమ్మకంతో పాయల్ ఉంది.


More Telugu News