ఎల్లుండి హైద‌రాబాద్‌లో ట్రాఫిక్ ఆంక్ష‌లు

  • శ్రీరామ‌న‌వమిని పుర‌స్క‌రించుకుని హైద‌రాబాద్‌లో శోభాయాత్ర 
  • భాగ్య‌న‌గ‌ర్ శ్రీరామ‌న‌వ‌మి ఉత్స‌వ స‌మితి ఆధ్వ‌ర్యంలో నిర్వ‌హ‌ణ‌
  • సీతారాంబాగ్ ద్రౌప‌ది గార్డెన్స్ నుంచి సుల్తాన్ బ‌జార్ వ‌ర‌కు ట్రాఫిక్ ఆంక్ష‌లు
శ్రీరామ‌న‌వమిని పుర‌స్క‌రించుకుని ఎల్లుండి హైద‌రాబాద్‌లో శోభాయాత్ర నిర్వ‌హించ‌నున్నారు. భాగ్య‌న‌గ‌ర్ శ్రీరామ‌న‌వ‌మి ఉత్స‌వ స‌మితి ఆధ్వ‌ర్యంలో సీతారాంబాగ్ ద్రౌప‌ది గార్డెన్స్ నుంచి మ‌ధ్యాహ్నం ఒంటి గంట‌కు ఈ శోభాయాత్ర ప్రారంభ‌మ‌వుతుంది. ఈ శోభాయాత్ర‌ రాత్రి 8 గంట‌ల‌కు సుల్తాన్ బ‌జార్ చేరుకోనుంది. సీతారాం బాగ్ టెంపుల్ నుంచి బోయిగూడ క‌మాన్, గాంధీ విగ్ర‌హం, బేగంబ‌జార్ మీదుగా శోభాయాత్ర సిద్ధంబ‌ర్ బ‌జార్, శంక‌ర్‌షేర్ హోట‌ల్, గౌలిగూడ‌, పుత్లీబౌలి ఎక్స్ రోడ్, కోఠికి చేరుకుంటుంది. 

దీంతో ఆయా మార్గాల్లో ట్రాఫిక్ ఆంక్ష‌లు విధిస్తున్న‌ట్టు పోలీసులు తెలిపారు. వాహ‌న‌దారులు ప్ర‌త్యామ్నాయ మార్గాల మీదుగా వెళ్లాల‌ని సూచించారు. ఎల్లుండి మ‌ల్లేప‌ల్లి జంక్ష‌న్, బోయిగూడ క‌మాన్, ఆఘ‌పురా జంక్ష‌న్, పురానాపూల్ ఎక్స్ రోడ్, ముస్లింజంగ్ బ్రిడ్జి, అల‌స్కా టీ జంక్ష‌న్, అఫ్జ‌ల్ గంజ్ టీ జంక్ష‌న్, రంగ‌మ‌హ‌ల్ జంక్ష‌న్, పుత్లీబౌలి ఎక్స్ రోడ్, సుల్తాన్ బ‌జార్ ఎక్స్ రోడ్ వ‌ద్ద ట్రాఫిక్‌ను మ‌ళ్లించ‌నున్నట్లు చెప్పారు.



More Telugu News