భారత్‌పై ప్రశంసల జల్లు కురిపించిన ఇమ్రాన్ ఖాన్‌పై నవాజ్ షరీఫ్ కుమార్తె ఆగ్రహం
- భారత్‌పై ప్రశంసల జల్లు కురిపించడం ఏమిటన్న మరియం
- ఇమ్రాన్ ఖాన్ చేసిన వ్యాఖ్యలు సరికాదని వ్యాఖ్య
- ఇమ్రాన్ పాకిస్థాన్‌ను వదిలి ఇండియాకు వెళ్లాలన్న మరియం
అవిశ్వాస తీర్మానాన్ని ఎదుర్కోనున్న పాకిస్థాన్ ప్రధాన మంత్రి ఇమ్రాన్ ఖాన్ గత రాత్రి భారత్‌పై ప్రశంసలు కురిపించిన విషయం తెలిసిందే. భారత్‌ను ఏ సూపర్ పవర్ కూడా శాసించలేదని ఆయన చేసిన వ్యాఖ్యలపై పాక్ మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ కుమార్తె మరియం నవాజ్ షరీఫ్ విమర్శలు గుప్పించారు.
భారత్‌పై ప్రశంసల జల్లు కురిపించడం ఏంటంటూ ఆమె ఇమ్రాన్‌ను నిలదీశారు. భారత్ ఆత్మాభిమానాన్ని కొనియాడుతూ ఇమ్రాన్ ఖాన్ పాక్‌పై చేసిన వ్యాఖ్యలు సరికాదని అన్నారు. భారత్‌ను కొనియాడుతున్న ఇమ్రాన్ ఖాన్ పాకిస్థాన్‌ను వదిలి ఇండియాకు వెళ్లాలని ఆమె అన్నారు. అధికారం కోల్పోతున్న ఇమ్రాన్ ఖాన్‌ను సొంత పీటీఐ పార్టీ నేతలు కూడా బహిష్కరిస్తున్నారని ఆమె చెప్పుకొచ్చారు.