బెంగళూరులో రేపు మాంసం విక్రయాలపై నిషేధం!

  • శ్రీరామ నవమి సందర్భంగా మాంసం బంద్
  • మాంసం షాపులు, కబేళాలు మూసి వేయాలని బీబీఎంపీ ఆదేశాలు
  • దక్షిణ ఢిల్లీలో కూడా ఈ నెల 11 వరకు మాంసం విక్రయాలపై నిషేధం
రేపు బెంగళూరులో మాంసం విక్రయాలను నిషేధిస్తూ బృహత్ బెంగళూరు మహానగర పాలికే (బీబీఎంపీ) ఆదేశాలను జారీ చేసింది. మాంసం విక్రయించే దుకాణాలతో పాటు, కబేళాలను కూడా మూసివేయాలని ఉత్తర్వుల్లో పేర్కొంది. శ్రీరామ నవమి సందర్భంగా బీబీఎంపీ ఈ నిర్ణయం తీసుకుంది. గణేశ్ చతుర్థి, మహా శివరాత్రి పర్వదినాల్లో మాంసం విక్రయాలను ఇప్పటికే అక్కడ నిషేధించారు. ఇప్పుడు శ్రీరామ నవమి సందర్భంగా కూడా మాంసం విక్రయాలను నిషేధిస్తూ నిర్ణయం తీసుకున్నారు. 

దక్షిణ ఢిల్లీలో కూడా మాంసం విక్రయాలపై నిషేధం విధించిన సంగతి తెలిసిందే. ఏప్రిల్ 4 నుంచి 11 వరకు దక్షిణ ఢిల్లీ పరిధిలో మాంసం దుకాణాలను మూసివేస్తున్నట్టు మేయర్ ముఖేష్ సూర్యన్ ఆదేశాలు జారీ చేశారు. నవరాత్రుల సందర్భంగా 99 శాతం మంది ఢిల్లీ ప్రజలు వెల్లుల్లి, ఉల్లిపాయలు కూడా తినరని ఆయన అన్నారు.


More Telugu News