వైసీపీ నేతల వ్యాఖ్యలు కరెక్టే.. జగన్ ప్రతిపక్ష నేతగా ఉండడమే మంచిది: టీడీపీ ఎంపీ కనకమేడల
- జగన్ సీఎంగా ఉండడం ఏపీ దౌర్భాగ్యమన్న కనకమేడల
- చంద్రబాబును తిట్టడమే పనిగా పెట్టుకున్నారని వ్యాఖ్య
- ‘కాగ్’ నివేదిక తప్పయితే పార్లమెంటులో ఎందుకు మాట్లాడడం లేదని ప్రశ్న
చంద్రబాబు ప్రతిపక్ష నేతగా ఉండడం దౌర్భాగ్యమంటూ వైసీపీ ఎంపీలు చేసిన వ్యాఖ్యలను టీడీపీ రాజ్యసభ సభ్యుడు కనకమేడల రవీంద్రకుమార్ తిప్పికొట్టారు. వారు చెప్పింది నిజమేనని, జగన్ ప్రతిపక్ష నేతగా ఉండడమే రాష్ట్రానికి మంచిదని అన్నారు. ఢిల్లీలో నిన్న విలేకరులతో మాట్లాడిన ఆయన.. జగన్ సీఎంగా ఉండడం ఏపీ దౌర్భాగ్యమని అన్నారు.
ప్రధానమంత్రిని కలిసిన జగన్ ఏం అడిగారని ప్రశ్నిస్తే తమను, తమ పార్టీ అధినేత చంద్రబాబును వైసీపీ ఎంపీలు దూషిస్తున్నారని, తిట్టడాన్నే వారు పనిగా పెట్టుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై ‘కాగ్’ చెప్పిన విషయాన్నే తాము చెబుతున్నామన్నారు. ఒకవేళ ‘కాగ్’ నివేదిక తప్పయితే వైసీపీ ఎంపీలు పార్లమెంటులో ఆ విషయమై ఎందుకు మాట్లాడడం లేదని కనకమేడల ప్రశ్నించారు.