వేలాదిగా ఈకో వాహనాలను వెనక్కి పిలిపిస్తున్న మారుతి సుజుకి

  • 19 వేలకు పైగా వాహనాల రీకాల్
  • వీల్ రిమ్ సైజులో లోపం గుర్తింపు
  • వాహనదారులకు సమాచారం
  • ఇదేమంత పెద్ద లోపం కాదన్న మారుతి సుజుకి
ఆటోమొబైల్ దిగ్గజం మారుతి సుజుకి ఈకో వాహనాల్లో తయారీపరమైన లోపాన్ని గుర్తించింది. దాంతో 19,371 ఈకో వాహనాలను వెనక్కి పిలిపిస్తోంది. ఈకో వాహనాల చక్రం రిమ్ సైజులో లోపాలు ఉన్నట్టు వెల్లడి కావడంతో మారుతి సుజుకి ఈ నిర్ణయం తీసుకుంది. అయితే, 2021 జులై 19 నుంచి 2021 అక్టోబరు 5వ తేదీ మధ్య తయారైన ఈకో వాహనాల్లోనే ఈ లోపం ఉన్నట్టు కంపెనీ వర్గాలు పేర్కొన్నాయి. 

రీకాల్ నేపథ్యంలో ఈకో సొంతదారులకు మారుతి సుజుకి అధీకృత వర్క్ షాపుల నుంచి సమాచారం అందించనున్నారు. కాగా, ఈ లోపం కారణంగా వాహన పనితీరు, భద్రత, పర్యావరణ అంశాలపై ప్రభావం ఉండదని మారుతి సుజుకి స్పష్టం చేసింది.


More Telugu News