తెలంగాణ‌లో మ‌ళ్లీ పెరిగిన ఆర్టీసీ చార్జీలు..ఈ సారి ఎంతంటే?

  • తాజా పెంపున‌కు డీజిల్ సెస్ అనే పేరు
  • ప‌ల్లెవెలుగు, ఆర్డిన‌రీ, సిటీ ఆర్డిన‌రీల్లో రూ.2 పెంపు
  • ఎక్స్‌ప్రెస్‌, డీల‌క్స్‌ మెట్రో డీల‌క్స్‌, సూప‌ర్ ల‌గ్జ‌రీల్లో రూ.5 పెంపు
  • ఏ బ‌స్సులో అయినా టికెట్ క‌నీస ధ‌ర‌గా రూ.10
  • కొత్త చార్జీలు రేప‌టి నుంచే అమ‌లు
తెలంగాణ‌లో మ‌రోమారు ఆర్టీసీ బ‌స్సు చార్జీలు పెరిగాయి. ఇప్ప‌టికే రెండు ద‌ఫాలుగా చార్జీల‌ను పెంచిన టీఎస్సార్టీసీ తాజాగా వ‌రుస‌గా మూడోసారి చార్జీల‌ను పెంచుతూ శుక్ర‌వారం కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. డీజిల్ సెస్ పేరిట తాజా చార్జీల‌ను పెంచుతూ తీసుకున్న ఈ నిర్ణ‌యం శ‌నివారం నుంచే అమ‌ల్లోకి రానుంది. అంటే.. శ‌నివారం నుంచే పెంచిన చార్జీలు అమ‌ల్లోకి రానున్నాయ‌న్న మాట‌.

డీజిల్ సెస్ పేరిట పెంచిన ఈ చార్జీలు ఆయా బ‌స్సుల్లో రెండు కేట‌గిరీలుగా అమ‌లు కానున్నాయి. పల్లె వెలుగు, ఆర్డిన‌టీ, సిటీ ఆర్డిన‌రీ స‌ర్వీసుల్లో రూ.2 పెర‌గ‌నున్న ఈ చార్జీలు.. ఎక్స్‌ప్రెస్‌, డీల‌క్స్‌, మెట్రో డీల‌క్స్‌, సూప‌ర్ ల‌గ్జ‌రీ స‌ర్వీసుల్లో ఏకంగా రూ.5 పెర‌గ‌నుంది. ఇదిలా ఉంటే.. ఏ బ‌స్సులోనైనా ఇక‌పై క‌నీస టికెట్ ధ‌ర‌ను రూ.10కు పెంచుతూ కూడా టీఎస్సార్టీసీ నిర్ణ‌యం తీసుకుంది.


More Telugu News